Suryaa.co.in

Entertainment

కొరటాల శివ ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా!

చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చిరు, చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. దర్శకుడు కొరటాలకు తొలి ఓటమి రుచి చూపించింది ఈ చిత్రం. అప్పటిదాకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న శివ ఒక్కసారిగా డీలా పడ్డాడు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆచార్య కష్టాలు శివను ఇంకా వదలడం లేదు.

‘ఆచార్య’ సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల ఆఫీసు ముందు నిన్న రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.

విడుదలకు ముందే ఈ చిత్రాన్ని నిర్మాతల దగ్గర నుంచి కొరటాల శివ తీసుకున్నారట. అందుకే బయ్యర్లు నష్టాన్ని కొరటాలనే భరించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

LEAVE A RESPONSE