పెట్టుబడుల అనుకూల వాతావరణం లేనప్పుడు పెట్టుబడి పెట్టేదెవరు?
బీజేపీ నేత లంకాదికర్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ దావోస్ వెళ్ళినా డల్లాస్ వెళ్ళినా రాను పోను ఖర్చులు కూడా దండగే అని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… దావోస్ ప్రయాణం పెట్టుబడుల కోసం కాదని ముందే చేతులెత్తేశారా అని ప్రశ్నించారు.
జగన్ పాలనలో పీపీఏ రద్దు, అమరావతి నిర్వీర్యం అనంతరం అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల నమ్మకం నీరుగారిందన్నారు. కియా ప్రతినిధులపై వైసీపీ ఎంపీ దాడిని ఏ అంతర్జాతీయ పెట్టుబడిదారులు మర్చిపోతారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం లేనప్పుడు ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రత్యేకత రివర్స్ టెండరింగ్,సాండ్, ల్యాండ్ మైనింగ్ మాఫియా” చెబుతారా అంటూ లంకా దినకర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్ధ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ఎప్పుడో తెలిసిందని, ముఖ్యంగా కియా వంటి అంతర్జాతీయ కంపెనీకి జరిగిన అవమానంపై అంతర్జాతీయ సంస్థలు విస్మయం వ్యక్తం చేశాయన్నారు. అందుకే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు.