కంటి చూపు సమస్యకు కరక్కాయల పొడి 30 గ్రా, తానికాయల పొడి 60 గ్రా, ఉసిరికాయల పొడి 90 గ్రా, అథి మధురం పొడి 10 గ్రా, వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా, పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా, పటిక బెల్లం పొడి 440 గ్రా, (పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి), అన్ని పొడులు బాగ కలిపి, గాజు సీస లో నిల్వ చేసుకోవాలి, 10 సంవత్సరాల లోపు — 1/4 స్పూను పొడి, 1/4 స్పూను నేయ్యి, 1/2 తేనె అనగా మూడు వేళ్ళతో వచ్చినంత పొడిని తీసుకోవాలి, పెద్దవాళ్ళకు 1/2 స్పూను, 1/2 స్పూను నేయ్యి, 1 తేనె వయస్సును బట్టి మోతాదు ఇవ్వాలి,ఇలా వాడుతు వుంటె కొన్ని రోజులకు కళ్ళ అద్దాలను తీసేయవచ్చు