Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ అరెస్టులతో జగన్ రెడ్డి, నన్ను అడ్డుకోలేడు

• చిలకలూరిపేటలో గెలవబోతున్నాననే జగన్ నా కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడు.
• జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి DRI వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
• తనకు.. తన పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే జగన్ ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాడు : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
•APSDRIని అడ్డుపెట్టుకొని 12 శాఖల్లోని 13 చట్టాలను జగన్ నిర్వీర్యం చేయడానికి సిద్ధమయ్యాడు : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య

తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే నా కుమారుడు శరత్ ను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారని, విధ్వంసం…విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్న జగన్ రెడ్డి.. ముందు శరత్ చేసిన తప్పేమిటో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు వేమూరి ఆనంద్ సూర్య, అంగర రామ్మోహన్ రావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు వారి మాటల్లోనే …

“ చిలకలూరిపేట నియోజకవర్గంలో 5 సార్లు పోటీచేస్తే, 3 సార్లు మంచి మెజారి టీతో గెలిచాను. చంద్రబాబు అండతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. ప్రజల్లో ఉండే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్ రెడ్డి ఇలాంటి నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నాడు.

జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి DRI వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం
చంద్రబాబు నాకు టిక్కెట్ ప్రకటించిన 24 గంటల్లోనే నా కుమారుడు సహా…కుటుంబసభ్యులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం (DRI) ఎవరి అధీనంలో పనిచేస్తోందో ముఖ్యమంత్రి చెప్పాలి. జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి DRI వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. చిలకలూరిపేటలో విజయం ఒకవైపు ఉండటాన్ని గమనించే DRI వ్యవస్థద్వారా నా కుమారుడు… మా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారు.

ప్రతిపక్ష సభ్యులపై బురదజల్లడమే ధ్యేయంగా జగన్ రెడ్డి DRI విభాగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. గిట్టనివారు.. ప్రతిపక్ష సభ్యులపై తప్పుడు కేసులు పెట్టించి, వారిని లొంగదీసుకోవాలన్న జగన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా DRI పనిచేస్తోంది. నాకు సీటు ప్రకటించిన 24 గంటల్లో కేసు పెట్టడం… నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చేశారు. అర్థరాత్రి ఎక్కడెక్కడో తిప్పి, ఎప్పుడో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో .. దానిపై ప్రజలు చర్చించుకోకూ డదని నాకుమారుడి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారు. రేపు గురజాల రా…కదలిరా సభ విజయవంతం కావడంతో మరో నాయకుడిని టార్గెట్ చేస్తారు.
తాడేపల్లి గూడెం సభ విజయవంతం కావడంతో దానిగురించి ప్రజలు చర్చించుకో కూడదన్న దురుద్దేశంతోనే జగన్ రెడ్డి DRIని రంగంలోకి దింపి, నా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఇలాంటి పనులు జగన్ రెడ్డికి బాగా అలవాటే కదా!

త్వరలో గురజాలలో రా…కదలిరా సభ ఉంది.. అది కూడా భారీస్థాయిలో విజయవంతం కావడం ఖాయం. ఆ సభ తర్వాత మరో టీడీపీ నాయకుడిని టార్గెట్ చేస్తారు. ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకోసం జగన్ DRIని వాడుకుంటున్నాడు. తెలుగుదే శం పార్టీలో బలమైన నాయకుల్ని దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, జగన్ రెడ్డికి మరేమీ పట్టడం లేదు. ఎదుటివారిపై పెట్టే తప్పుడుకేసులతో తనకు నష్టం జరు గుతుందని తెలిసినా జగన్ రెడ్డి ఆగడు.

సొంత చెల్లినే వదలని వాడు..ప్రతిపక్షనేతల్ని వదిలేస్తాడా?
తోడబుట్టిన చెల్లిని, బాబాయ్ కూతురినే వేధిస్తున్న వ్యక్తి సామాన్యుల్ని.. ప్రతిపక్ష నేతల్ని వదిలేస్తాడా? పోలీసులు నా కుమారుడును 16 గంటలపాటు 6 స్లేషన్లు తిప్పారు. ఎక్కడ ఎవరిని అడిగినా మాకుతెలియదు.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలనే చెప్పారు.” అని పుల్లారావు తెలిపారు.

ప్రజల్లో తనకు.. తన పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే జగన్ ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుడుతున్నాడు : కొల్లు రవీంద్ర

పుల్లారావు కుమారుడు శరత్.. ఆయన కుటుంబసభ్యులపై DRI విభాగంతో అక్రమ కేసులు పెట్టించి, రాత్రి ఎప్పటికో మాచవరం పోలీస్ స్టేషన్లో సెక్షన్ 409, 461, 420లు నమోదు చేయించి, న్యాయమూర్తితో శరత్ కు రిమాండ్ వేయిం చారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. తెలుగువరంతా ఈ ప్రభుత్వ తీరుని, ముఖ్యమంత్రి కక్షసాధింపుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు… తన ప్రభుత్వా నికి ప్రజల్లో ఎదురుగాలి వీస్తోందనే జగన్ రెడ్డి ఇలాంటి చర్యలకు సిద్ధమయ్యాడు. తాడేపల్లిగూడెం సభ విజయవంతంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న తరుణం లో జగన్ రెడ్డి ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెరతీశాడు. జగన్ రెడ్డి తప్పుడు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయం.

మొన్నటివరకు సీఐడీ…ఇప్పుడు DRI.. శరత్ కు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది
తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సూట్ కేసు కంపెనీలు పెట్టి, లక్షలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి.. తనలాగే యువపారిశ్రామికవేత్తలు కూడా తప్పుడు మార్గంలో సంపా దిస్తారని జగన్ అనుకుంటున్నాడు. మొన్నటివరకు సీఐడీని జేబు సంస్థగా మార్చిన జగన్ రెడ్డి…ఇప్పుడు DRI తో తన కుట్రలు అమలుచేస్తున్నాడు. శరత్ కు న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుంది. జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా ప్రజల్ని చైతన్యం చేసి… టీడీపీ-జనసేన కూటమి విజయకేతనం ఎగరే యడం ఖాయం. చిలకలూరిపేటలో పుల్లారావు గెలుపు ఆపడం ముఖ్యమంత్రి తరం కాదు.” అని రవీంద్ర తేల్చిచెప్పారు.

APSDRIని అడ్డుపెట్టుకొని 12 శాఖల్లోని 13 చట్టాలను జగన్ నిర్వీర్యం చేయడానికి సిద్ధమయ్యాడు : వేమూరి ఆనంద్ సూర్య

“మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండి స్తున్నాం. శరత్ పై ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు యువపారిశ్రామికవేత్తలను దెబ్బకొట్టడమే. పెచ్చుమీరిన జగన్ రెడ్డి రాజకీయ కక్షలకు శరత్ అరెస్ట్ నిదర్శ నం.APSDRI విభాగాన్ని అడ్డుపెట్టుకొని ప్రతపక్ష నేతలే లక్ష్యంగా జగన్ రెడ్డి 12 శాఖల్లో 13 చట్టాలను మింగేయాలన చూస్తున్నాడు. గతంలో ఇలానే టీడీపీ అధినేత సహా.. పలువురు కీలకనేతల్ని జగన్ రెడ్డి తప్పుడు కేసులతో జైలుకు పంపాడు. పరదాలు.. పోలీసుల మాటున బిక్కుబిక్కుమంటూ బతికే జగన్ రెడ్డి మా పార్టీని.. మా నాయాకుల్ని ఏం చేయలేడు?

వైనాట్ 175 అంటున్న జగన్ ను పులివెందుల సంగతి చూసుకోమని ప్రజలే అంటున్నారు. టీడీపీ-జనసేన నాయకుల విషయంలో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు.. ఆతనికి, అతని పార్టీకే కోలుకోలేని నష్టం కలిగిస్తుంది. జగన్ పని అయిపోయింది.. వైసీపీ ఇంటికి పోతుం దని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ తన వైఖరి మార్చకో కుంటే ప్రజలు తరిమితరిమి కొట్టి ఆయన్ని బంగాళాఖాతంలో కలుపుతారు.” అని ఆనంద్ సూర్య చెప్పారు.

ప్రజలపై.. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకే జగన్ రెడ్డి తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు : అంగర రామ్మోహన్ రావు (మాజీ ఎమ్మెల్సీ)

జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై.. ప్రజలపై నమ్మకం లేదు. అందుకే తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని దెబ్బతీయడానికి తన మాట వినే సంస్థల్ని వాడుకుంటు న్నాడు. టీడీపీ-జనసేన పొత్తుని ప్రజలు ఆమోదించారు. తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో జగన్ సహా వైసీపీనేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి. చెల్లి కొడుకు.. సొంత మేనల్లుడినే దీవించలేని జగన్ .. విద్యార్థులకు మేనమామ అవుతాడా?” అని అంగర ప్రశ్నించారు

 

LEAVE A RESPONSE