Suryaa.co.in

Andhra Pradesh

జగనే 420 కాబట్టి నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు

– జగన్ రైతుల పాలిట శని
– వైసిపి నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు
– ధాన్యం కొనమని అడిగితే ఎర్రిపప్ప అని తిట్టి రైతులను అవమానించారు ఒక మంత్రి
– పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు
– ఎన్నికల ముందు రైతు భరోసా రూ.12,500 ఇస్తాను అని చెప్పి ఇప్పుడు కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు
– ఒక్కో రైతుకి రూ.25 వేలు మోసం చేశాడు జగన్
– నంద్యాల రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్

పత్తి వేసి తీవ్రంగా నష్టపోయాం. కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయాం. పైగా ప్రతికూల వాతావరణం వలనే పత్తి దెబ్బతింది అని అధికారులు అంటున్నారు.- సాంబశివరావు
సేంద్రియ వ్యవసాయం కోసం ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. – డోన్ కి చెందిన రైతు రవి
మా పొలాలను ఆక్రమించుకొని మంత్రి బుగ్గన అనుచరులు రోడ్డు వేస్తున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. మీరు మాకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? – బాలఈశ్వర రెడ్డి
గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాయలసీమ నీటి కష్టాలు తీరతాయి. – తులసి రెడ్డి
వేరుశనగ రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు. మద్దతు ధర కల్పిస్తాం అని జగన్ మోసం చేశాడు. కనీసం లోన్లు కూడా ఇవ్వడం లేదు. – శ్రీకాంత్
గ్రీన్ హౌస్, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రావడం లేదు. – భాస్కర రెడ్డి
అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వహణ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. – నంద్యాల రైతులు

ఈ సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ స్పందిస్తూ..
జగన్ రైతుల పాలిట శని.రాయలసీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారు. రాయలసీమ లో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.టిడిపి హయాంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మాలి అంటే భయపడేవారు. జగనే 420 కాబట్టి ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. జగన్ చేతగానితనాన్ని వాతావరణం పై తోసేసి రైతులకు అన్యాయం చేసారు.

టిడిపి హయాంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం కోసం టిడిపి ప్రభుత్వం లో ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను వైసిపి నాశనం చేసింది. పెట్టుబడి తగ్గించాలి అనే ఉద్దేశంతోనే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫ్ఫార్మింగ్ ని ప్రోత్సహించాం. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు తగ్గించి వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.. టిడిపి హయాంలో పాడి రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఇప్పుడు జగన్ కనీస సాయం అందించడం లేదు.

వైసిపి నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు. మంత్రి బుగ్గన నియోజకవర్గం లో రైతు రవి కి అన్యాయం జరిగితే కనీసం స్పందించలేదు. బుగ్గన అనుచరులే రైతుల పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రవి కి టిడిపి అండగా ఉంటుంది. రాబోయేది టిడిపి ప్రభుత్వమే మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత నాది.

రైతులను వైసిపి ప్రభుత్వం నిత్యం అవమానపరిస్తుంది. ధాన్యం కొనమని అడిగితే ఎర్రిపప్ప అని తిట్టి రైతులను అవమానించారు ఒక మంత్రి. టిడిపి హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 11,700 కోట్లు ఖర్చు చేసాం. వైసిపి హయాంలో కనీసం టిడిపి చేసిన దాంట్లో 10 శాతం కూడా ఖర్చు కూడా చెయ్యలేదు. కర్నూలు నుండి వలసలు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడిన తరువాత నాకు బాధ కలిగింది. టిడిపి హయాంలో నీటి ని సమర్థవంతంగా వాడుకోవడం కోసం 7 లక్షల పంట కుంటలు కూడా తవ్వాం.

గోదావరి, కృష్ణా , పెన్నా అనుసంధానం ప్రక్రియ ప్రారంబించింది టిడిపి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తాం.గుండ్రేవుల ప్రాజెక్టు టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి చేస్తాం. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం.

పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు.టిడిపి హయాంలో 50 వేలు లోపు ఉన్న రుణాలు అన్ని ఒక్క సంతకం తో రద్దు చేసాం. భూసార పరీక్షలు, మైక్రో నూట్రియెంట్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర, వ్యవసాయ పరికరాలు,రైతు రథాలు అందించాం.

జగన్ పాలనలో గిట్టుబాటు ధర లేదు, రూ.3500 ధరల స్థిరీకరణ నిధి అన్నాడు ఆ నిధి ఎక్కడికి పోయింది, ఇన్స్యూరెన్స్ లేదు, రైతు రుణాలు ఇవ్వడం లేదు, వ్యవసాయం చెయ్యడానికి పరికరాలు, యంత్రాలు ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు రైతు భరోసా రూ.12,500 ఇస్తాను అని చెప్పి ఇప్పుడు కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రూ.25 వేలు మోసం చేశాడు జగన్.ప్రతి ఏడాది గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం అని హామీ ఇచ్చి మోసం చేశాడు జగన్.

టిడిపి హయాంలో సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ అందించాం. జగన్ ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశాడు. టిడిపి హయాంలో హార్టికల్చర్ కి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లో ఏ జోన్ లో ఎటువంటి పంటలు వెయ్యాలో అధ్యయనం చేసి రైతులకు సహకారం అందిస్తాం.

బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో వ్యవసాయం పై అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఏపిలో కూడా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్ వర్క్స్ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం. జగన్ పాలనలో అన్ని హాలిడేలే… క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే లే మిగిలాయి.

టిడిపి హయాంలో నేరుగా ఉపాధి హామీని అనుసంధానం చేసే అవకాశం లేకపోయినా హార్టి కల్చర్, పంట కుంటలు ఇతర అంశాల్లో ఉపాధి హామీ ని అనుసంధానం చేసాం. ఇప్పుడు జగన్ రాయలసీమ రైతుల మెడకి మీటర్ల పేరుతో ఉరి తాడు వేస్తున్నాడు. ఇది గ్యాస్ సబ్సిడీ లాంటిదే. మోటార్ల కు మీటర్లు పెట్టడానికి అంగీకరిస్తే ఇక మీరు నెల నెల బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీటర్లు బిగించి రైతుల పేరుతో అప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్.

వరి, పత్తి, వేరు శనగ, జొన్న, మిరప, పసుపు, మినుములు వేసే రైతుల కష్టాలు అన్ని నేను తెలుసుకున్నాను. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యడం తో పాటు. పంట అమ్ముకోవడం కోసం మార్కెట్ ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పిస్తాం.

LEAVE A RESPONSE