నువ్వు పేదల గురించి మాట్లాడతావా? నీకా అర్హత ఉందా?

Spread the love

– నువ్వు అబద్ధం చెప్తావని తాజా గూగుల్ మ్యాప్ కూడా చూపిస్తున్నా. ఆ కాలనీ ఏమైంది?
2019 వరకు నీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అమరారెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉండేది
ఆ పేదల కాలనీని రాత్రికి రాత్రి మాయం చేసింది నిజం కాదా చెప్పు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

లక్ష కోట్ల ప్రజాధనాన్ని దిగమింగిన అవినీతి అనకొండ ఇప్పుడు తానొక పేదవాడిని అని అంటోంది. పేదలంటే ప్రాణం అంటోంది. పేదల కోసం అవతరించిన మహానుభావుడిలా మాట్లాడుతోంది. జగన్ రెడ్డీ… ఈ గూగుల్ మ్యాప్ చూసి చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చిన 2019 వరకు నీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అమరారెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉండేది.

సుమారు 1000 పేద కుటుంబాలు అక్కడ నివసించేవి. నువ్వు అధికారంలోకి రాగానే… నీ తాడేపల్లి ప్యాలెస్ కు మరో రాజమార్గం కావాలని చెప్పి ఆ పేదల కాలనీని రాత్రికి రాత్రి మాయం చేసింది నిజం కాదా చెప్పు! నువ్వు అబద్ధం చెప్తావని తాజా గూగుల్ మ్యాప్ కూడా చూపిస్తున్నా. ఆ కాలనీ ఏమైంది? నువ్వు పేదల గురించి మాట్లాడతావా? నీకా అర్హత ఉందా?

Leave a Reply