Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గం

– ప్రతి కేసుకూ.. ప్రతి దాడికీ.. బదులు చెప్తాం
– చంద్రబాబు నాయుడు
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల నీతిమాలిన తనానికి నిదర్శనం.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే.. అరెస్టు చేస్తారా అంటూ గతంలో సుప్రీంకోర్టు పోలీసుల్ని హెచ్చరించింది. దేశంలోని ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) నొక్కిచెబుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడం దుర్మార్గం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత వేధించినా.. ప్రతి ఘటనకూ వడ్డీతో సహా చెల్లిస్తాం. టీడీపీ నేత సందీప్ పై వేధింపులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం విధించిన లక్ష్మణ రేఖలను మీరితే శిక్షలు తప్పవు. ఈ విషయాన్ని గుర్తించి గురజాల సందీప్ మహదేవ్ ను తక్షణమే విడుదల చేయాలి.

LEAVE A RESPONSE