Suryaa.co.in

Entertainment

ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు కన్నుమూత

చిత్ర పరిశ్రమంలో విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషాల్లో విశ్వేశ్వర రావు అనేక సినిమాల్లో నటించారు. తన నటనతో అందరిని నవ్వించారు. విశ్వేశ్వర రావు మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించినట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. విశ్వేశ్వర రావు మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది.

ఆయన కెరీర్‌లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. బాలనటుడిగానే 150 చిత్రాల్లో నటించడం విశేషం. సీనియర్‌ ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, చిరంజీవి, రజినీకాంత్‌, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌ ఇలా ఎంతోమంది స్టార్‌ హీరోలతో ఆయన నటించారు. ఆమె కథ, ముఠా మేస్త్రీ, బిగ్‌బాస్‌, ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్‌ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ వంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.

ఆమె కథ, ముఠా మేస్త్రీ, బిగ్‌బాస్‌, ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్‌ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విశ్వేశ్వర రావు నిర్మాత, దర్యకుడిగా కూడా మారారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. విస్సు టాకీస్ పేరుతో తమిళ్ లో ఈ యూట్యూబ్ ఛానల్ కొనసాగిస్తున్నారు.

LEAVE A RESPONSE