వైసీపీ నేతల పొగరు దించుతాం

గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు

పల్నాడు వైసీపీ నేతల పొగరు త్వరలోనే దించుతామని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచవరం పట్టణంలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరా వు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో అధికార మదంతో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిందన్నారు. కూటమి పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి గురజాల నియోజకవర్గం అభివృ ద్ధికి, మాచవరం మండల అభివృద్ధికి పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తాగునీటి సమస్య పరిష్కరిస్తా: లావు
నరసరావుపేట పార్లమెంటరీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో కొన్నిచోట్ల 1200 అడుగులు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి ఉందన్నారు. పల్నాడు ప్రాంతానికి వేసవికాలంలో తీవ్ర నీటి సమస్య వస్తుందని ఆలోచించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌ ఇచ్చి మంచినీటిని అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జలజీవన్‌ మిషన్‌ ద్వారా పల్నాడు జిల్లాకు రూ.500 కోట్లు మంజూరు చేయించా నని వివరించారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గానికి 73 కోట్లు మంజూరు అయ్యేలా చేశామని తెలిపారు. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఈరోజు ముందుకు రాని పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ కాంట్రాక్ట్‌ బిడ్‌ వేసి పనిచేస్తే ఆ నిధులు సరిపోతాయా, సరి పోవా అనే అనుమానం కాంట్రాక్టర్లకు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే కాంట్రా క్టర్లు ఏ విధంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply