Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌కు ఎన్నికల సంఘం షాక్‌

-ఏపీలో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీపై బదిలీ వేటు
-ముగ్గురు ఐఏఎస్‌ కేడర్‌ ఎన్నికల అధికారులపైనా చర్యలు
-ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో ఉండరాదు
-తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశం
-కొత్తవారి భర్తీకి ప్యానల్‌ పంపాలని ప్రభుత్వానికి సూచన
-టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు

ఎన్నికల నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు ఐఏఎస్‌ కేటగిరీకి చెందిన ఎన్నికల అధికారులపౖౖె బదిలీ వేటు వేస్తూ మంగళవారం ఆదేశాలిచ్చింది. టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపి ఈ చర్యలు తీసుకుంది. బదిలీ అయిన వారు తక్షణమే తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే తప్పుకోవాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు వారు విధుల్లో ఉండరాదని ఆదేశించింది.

సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్‌ పంపాలని ఆదేశాల్లో ప్రభుత్వానికి సూచించింది. బదిలీ వేటు పడిన వారిలో ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ ండ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్‌, నెల్లూరు ఎస్పీ కె.తిరుమలేశ్వర్‌ రెడ్డి, ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు, అనంతపురం ఎన్నికల అధికారి ఎం.గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు. ఈసీ ఆదేశాల మేరకు మరి కాసేపట్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి తదుపరి ఉత్తర్వులివ్వనుంది.

LEAVE A RESPONSE