ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పా?

తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి యలగాల నూకానమ్మ
నందిగామ.. తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి యలగాల నూకానమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అదే విధంగా మిగతా జిల్లాల్లో కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల పై భౌతిక దాడులు చేయడమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రజాస్వామ్యం లో ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు.
ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఊరు,ఊరు తిరుగుతూ ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడమే కాకుండా ప్రజల పై అనేక రకాలుగా మోపుతున్న పన్నుల భారాన్ని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని అధికారపక్షం భౌతిక దాడులు చేయడం నీచమైన చర్య అన్నారు.ప్రశ్నించిన వారి పై భౌతిక దాడులు చేయడం అదే విధంగా కార్యాలయాలు ధ్వంసం చేయడం అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని,ప్రతిపక్ష పార్టీలుగా తాము చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రజల పక్షాన పోరాడుతున్న నేతలపై దాడి చేయడం,తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పై చేసిన దాడి అని అన్నారు. ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతను రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజల దృష్టి మార్చాలనే వైసీపీ లక్ష్యమని,ఇది ఒక ప్లాన్ ప్రకారం పక్కా వ్యూహంతో జరిగిన దాడిగా భావిస్తున్నామని ప్రభుత్వము తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యాలగాల నుకానమ్మ హెచ్చరించారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు.