Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ను వేటాడి, వెంటాడి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి

-టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు అయిందని… ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఈ మహానాడుకు చాలా ప్రత్యేకత ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసి, జైలు జీవితం గడిపిన ఒక దొంగకు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించామని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు.

రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీని… ఐదేళ్లలో చంద్రబాబు అగ్రగామిగా తీర్చిదిద్దారని అన్నారు. అయితే, ఆ విషయాన్ని ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అయ్యామని చెప్పారు. జగన్ అనే దుర్మార్గుడు రాష్ట్రమంతా తిరిగి టీడీపీపై తప్పుడు ప్రచారం చేశారని… కానీ ప్రజలు స్పందించలేదని… దీంతో కోడికత్తి డ్రామా ఆడారని… అయినా ప్రజల్లో స్పందన రాలేదని అన్నారు. దీంతో, సొంత బాబాయ్ ని చంపి, ప్రజల సానుభూతితో సీఎం అయ్యాడని మడిపడ్డారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కు మదం ఎక్కిందని, దుర్మార్గమైన ఆలోచనలతో మహిషాసుర పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ తప్ప మరో రాజకీయ పార్టీ ఉండకూడదనే దుష్ట ఆలోచనతో మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తల సహకారంతో, చంద్రబాబు నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. జగన్ ను రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. జగన్ ను వెంటాడి, వేటాడి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తండ్రి సీఎం అయినప్పుడు చిల్లిగవ్వ లేక జగన్ ఇంటిని తాకట్టు పెట్టాడు
ఎన్నికల్లో ఓడిపోతాననే విషయం జగన్ కు తెలిసిపోయిందని  అన్నారు. ఓటమి భయంతోనే సభల్లో అన్నీ అబద్ధాలు చెపుతున్నారని… తనకు టీవీ లేదు, పేపర్ లేదు, బంగళా లేదు, తాను పేదవాడినని ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ ఒక్కడి ఆస్తి ఎక్కువని అన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటిని తాకట్టు పెట్టిన జగన్… ఇప్పుడు దేశంలోనే సంపన్నుడైన సీఎం అని విమర్శించారు.

ప్రజల మీద రకరకాల పన్నులు వేస్తూ అందరినీ కష్టాలపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం అయిన తర్వాత 3 లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ డబ్బులతో నిండిపోయిందని, దీంతో ఇప్పుడు డబ్బును ఇడుపులపాయకు తరలించి భూమిలో దాచిపెడుతున్నారని అన్నారు. వివేకాను చంపింది జగనే అని తాము ముందు నుంచి చెపుతున్నామని… నిన్న సీబీఐ కూడా జగన్ పేరును చెప్పిందని తెలిపారు. అవినాశ్ అరెస్ట్ అయితే ఆ తర్వాత కేసు తనపైకి వస్తుందని జగన్ భయపడుతున్నారని చెప్పారు.

రూ. 2 వేల నోట్లన్నీ జగన్ నేలమాళిగల్లో ఉన్నాయని… ఇప్పుడు వాటిని మార్చుకోలేక తల్లడిల్లిపోతున్నాడని అన్నారు. మండుటెండల్లో కూడా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని చెప్పారు. మహానాడు కోసం టీడీపీ ఏర్పాటు చేసిన పోస్టర్లను జగన్ బ్లేడ్ బ్యాచ్ రాత్రి వచ్చి బ్లేడ్లతో కోసేసిందని మండిపడ్డారు.

LEAVE A RESPONSE