Suryaa.co.in

Andhra Pradesh

ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు

-నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా అమ్ముకుంటున్నారు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఒక్క క్వారీకి కూడా అనుమతి లేదు. అక్రమ మైనింగ్ పై జిల్లా అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కాకాని అక్రమ మైనింగ్ పై 21 రోజుల నుంచి సోమిరెడ్డి పోరాటం చేస్తున్నా పోలీసులు స్పందించకపోవటం వైసీపీ అక్రమాలకు అద్ధంపడుతోంది.వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేయాలి, మంత్రి కాకాని పై చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE