Suryaa.co.in

Features

ఫాంటసీ ఆయన లెగసీ!

జానపదబ్రహ్మ …

విఠలాచార్య..
దెయ్యాల మేడలు..
పిశాచాల ఊళలు..
మాంత్రికుల గుహలు..
అక్కడ భీకరంగా
మండే మంటలు..
రాజుగారి కోటలు..
బురుజులు దూకే
హీరోలు..
సేనాపతుల కుట్రలు..
మాయలు..మంత్రాలు..
కత్తి యుద్దాలు..
అబ్బో..లేనివి ఏమిటి..
చిన్నప్పుడు చందమామలో చదివిన కథలకు
దృశ్యరూపాలు..
నేటి క్లిష్టమైన గ్రాఫిక్స్ కు
నాటి ఈజీ రూపాలు..
ఈ తరం దర్శకుల
అయిదేళ్ల సాగదీతలకు
సులువైన పాఠాలు..!

పేరైతే జానపదబ్రహ్మ..
కాని మొదట్లో
సాంఘీకాలు తీసి
అప్పుడు పట్టాడు కత్తి..
అయితే ఎన్టీఆర్..
లేదంటే కాంతారావు..
కాకుంటే ఇద్దరూ..
చిక్కడు..దొరకడు..
గాలిపటంపై ఎగిరే అగ్గిబరాటా..విజయబావుటా
ఒకరిని కొడితే ఇంకొకరికి
నొప్పి కలిగే అగ్గి పిడుగు
ఇలాంటి జిమ్మిక్కులు
ఎలాంటి గ్రాఫిక్కులు
లేకుండా తీసిన
చిచ్చరపిడుగు..
విఠలాచార్య..
నేటి దర్శకులకు
పాఠాలు..గుణపాఠాలు
నేర్పించిన నాటి ఆచార్య..!

అదుపులో ఉండే మదుపు..
అవసరమైన చోట పొదుపు..
పక్కా షెడ్యూలింగ్..
చక్కని పేమెంట్..
వీటికి విఠలాచార్య పేటెంట్!
ఎవరి కాల్షీట్ లేకపోతే
వారు వెంటనే సినిమాలో
పిట్టగానో..పులిగానో మార్పు
అంత తమాషాగా
ఆయన కూర్పు..
ప్రత్యేక నేర్పు..
అదే ఆయన
రాజకోటరహస్యం..
అలా సినిమాలు తీసే
పొందాడు లక్ష్మీకటాక్షం..
రూటు మార్చి తీస్తే
బీదలపాట్లు…
మొదలయ్యాయి పెద్దాయనకు పాట్లు…!

ఆయన సినిమాలు
చందమామ కధలు…
బాలమిత్ర బొమ్మలు..
అలవోకగా తీసేసిన
కాశీమజిలీ బాహుబలిలు..
ఒక తరం పసితనపు
అబ్బురాలు..
చవకగా ఫాంటసీ..
అదే ఆయన లెగసీ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

 

LEAVE A RESPONSE