– అవి మీ మెడకు ఉరితాడుగా మారతాయి.
– పత్తి చేలో దిగి రైతు కష్టాలు తెలుసుకున్న లోకేష్
ఆత్మకూరు నియోజకవర్గం గుడిగుంట క్రాస్ వద్ద పత్తిచేలో దిగిన లోకేష్, రైతు కష్టాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భ పత్తిరైతు కరణం రవి తమ ఇబ్బందులను తెలియజేస్తూ… రెండున్నర ఎకరాల్లో పత్తి సాగుచేశాను. ఎకరాకు 50వేలు ఖర్చయింది.విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల ఎత్తు పెరిగింది కానీ కాపురాలేదు.గులాబీరంగు దోమవల్ల కాపు తగ్గిపోవడమేగాక గుడ్డిపత్తిగా మారి నాణ్యత తగ్గిపోయింది.
20 క్వింటాళ్లు రావాల్సింది 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది, క్వింటా 5వేలు పలుకుతోంది. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయాను. డ్రిప్ లు లేకపోవడంతో పత్తిసాళ్లకు నీళ్లు పెట్టడం వల్ల గడ్డి ఎక్కువ పడుతోంది.కలుపుతీత ఖర్చులు భారీగా పెరిగాయి. మాకు డ్రిప్ సౌకర్యం కల్పిస్తే ఈ సమస్య ఉండదు.
సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తిచేసి, నీళ్లివ్వాలి. బోర్లతో తోడుకోవాల్సి వస్తోంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
వ్యవసాయమంత్రి మీ జిల్లా వాడే, ఆయన కోర్టులో పత్రాల చోరీ కేసులో సిబిఐ చుట్టూ తిరుగుతున్నాడు, మిమ్మల్ని పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుంది? గతంలో 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించడమేగాక ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు అంగీకరించొద్దు. అవి మీ మెడకు ఉరితాడుగా మారతాయి.
టిడిపి అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రిప్ ఇరిగేషన్ తో పాటు గతంలో రైతులకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.