కరెంటు బిల్లు షాక్ కొడుతుందయ్యా!

Spread the love

– లోకేష్ ఎదుట ఓ మహిళ ఆవేదన

వైసిపి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లు షాక్ కొడుతోందని యువనేత లోకేష్ ఎదుట ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గౌరవరానికి చెందిన రమణమ్మ అనే మహిళ పాదయాత్రదారిలో యువనేత లోకేష్ ను కలిసి ఈనెలలో వచ్చిన బిల్లుతోపాటు గతంలో వచ్చిన బిల్లును చూపించింది. ఇంటిలో రెండు లైట్లు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. గతంలో నెలకు 180రూపాయలు మాత్రమే వచ్చేది,
ఇప్పుడు రూ.480 వచ్చింది. రీడింగ్ తీసే వాడ్ని అడిగితే మాకు తెలియదు, ప్రభుత్వం చెప్పిన ప్రకారమే బిల్లు తీస్తున్నామంటున్నారు. వ్యవసాయం గిట్టుబాటు లేక నానా అగచాట్లు పడుతున్నాం, మూలిగే నక్కమీద తాటిపండు మాదిరిగా కరెంటు బిల్లు, ఇంటిపన్నులు పెంచేస్తే మేం ఎలా బతకాలయ్యా అంటూ వాపోయింది. ఫ్యాన్ ను పర్మినెంట్ గా స్విచ్చాఫ్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం, ఒక్క ఏడాది ఓపిక పట్టండి… రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీకు ఉపశమనం కలిగిస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు.

 

Leave a Reply