– కూసుమంచి మండలం లో విస్తృతంగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: హాట్యా తండా వద్ద తెగిన నాగార్జున సాగర్ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్య పడవద్దు.ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయిస్తాం. వరద ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలి.