– ఎమ్మెల్యే, కన్నా లక్ష్మీనారాయణ
తెనాలి: ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలతో రైతుల్లో పండుగ వాతావరణం సంతరించుకుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే, కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ఎడ్లబల ప్రదర్శన, పశుపాల పోటీలకు ఆరవరోజు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నాలక్షిణారాయణ, మైలవరం ఎమ్మెల్యే వనంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పలు కార్పొరేషన్ల చైర్మన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తొలుత దివంగత ఎన్టీఆర్, ఆలపాటి శివరామకృష్ణయ్యల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కన్నా లక్ష్మీణా రాయణ మాట్లాడుతూ తెనాలిలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలతో పండుగ వాతావరణం సంతరించుకుందన్నారు.వ్యవసాయంలో పెరిగిన యాంత్రికరణతో పశుపోషణపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతుందన్నారు.
అటువంటి తరుణంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, పశు పాలపోటీలు నిర్వహిస్తూ రైతుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తిరిగి పశువుల పోషణ చేపట్టాలన్న ఆసక్తి పెంచేలా ఇటువంటి కార్యక్రమాలు జరపడం సం తోషంగా ఉందన్నారు.పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వారి ప్రసంగాన్ని వినిపించారు. కార్యక్ర మంలో నిర్వాహక కమిటీ సభ్యులు, పెద్దసంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.