Suryaa.co.in

Andhra Pradesh

ఫీవర్ సర్వేను త్వరగా పూర్తి చేయాలి

• హెల్త్ ఐడిల జనరేషన్ డ్రైవను వేగవంతం చేయాలి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలపై అసంతృప్తి
• క్షేత్ర స్థాయిలో డిఎంహెచ్ఐలు పర్యటించాలి.
• ప్రతి పిహెచ్సీలోనూ ఇద్దరు వైద్యాధికారులుండాలి
• వారంలోగా పిహెచ్సిలలో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలి
– ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఫీవర్ సర్వేను పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య, జిల్లా ఇమ్యునైజేషన్, జిల్లా మలేరియా అధికారులతో మంగళగిరిలోని ఎపిఐఐసి ఆరో అంతస్తు మీటింగ్ హాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గడువులోగా ఫీవర్ సర్వేను పూర్తి చేయాల్సిందేనని, అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సంబంధిత వైద్య అధికారులు మండల అభివృద్ధి అధికారుల సహకారంతో ఫీవర్ సర్వేకు ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాల స్థాయిలో మొబిలైజేషన్ చేసుకోవాలన్నారు. హెల్త్ ఐడిల జనరేషన్ డ్రైవ్ ను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఎఎన్ఎం రోజుకు 20 హెల్త్ బడిలను జనరేట్ చేయాలన్నారు. ఫీవర్ సర్వేకు వెళ్లే ఆశా వర్కర్లతో పాటు ఎఎన్ఎంలు కూడా వెళ్లి ఈ డ్రైవను వేగవంతం చేయాలని సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలపై అసంతృప్తి
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(ఏహెచ్ఎస్)లలో అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ కేంద్రాల్లో ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గర్భిణులకు ఆరోగ్యశ్రీ ఆసరాపై అవగాహన కల్పించి , వారిని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలకు ఆరోగ్యశ్రీ ఆసరా కింద తల్లులకు రు.5,000, రు.3,000 వంతున ప్రోత్సాహకాలిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఏహెచ్సీల్లో సాధారణ ప్రసవాలు అంతంత మాత్రంగా జరగటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు విషయంలో పిహెచ్ సీలు సర్వసన్నద్ధంగా వుండాలన్నారు. డిపిహెచ్, డిఎంఇ విభాగాల బయోమెట్రిక్ విషయంలో ఆశించిన పురోగతి లేదని ఆయన అన్నారు. పీహెచ్ సీల్లో ప్రసవాలు, బయోమెట్రిక్ హాజరు విషయాల్లో ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని నివాస్ గుర్తు చేశారు. వారంలోగా పిహెచ్ సీలలో బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి పిహెచ్ సికి రు.25 వేలు, సిహెచ్ సీనకి రూ.లక్ష వంతున నిధులిచ్చామని, లేబర్ రూమ్ లలో టాయిలెట్లు, విద్యుత్ సరఫరా లేని సమయాల్లో జనరేటర్ల కోసం ఈ నిధులు వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ప్రతి పిహెచ్ సీలోనూ ఇద్దరు వైద్యాధికారులు తప్పనిసరిగా వుండాల్సిందేనని, వారిని వేరే ప్రాంతాలకు పంపవద్దని నివాస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. పిహెచ్ సీలలో మౌలిక వసతుల కల్పనలో శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. హెల్త్కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డౌస్ పంపిణీ విషయంలో అలసత్వం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

క్షేత్ర స్థాయిలో డిఎంహెచీలు పర్యటించాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారు(డిఎంహెచ్ఓ)లు క్షేత్ర స్థాయిలో రెగ్యులర్ గా పర్యటించే విధంగా పర్యవేక్షించాలని ఆయన ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతిని ఆదేశించారు. డిఎంహెచ్ఓలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలన్నారు. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి, ఎపివిపి కమీషనర్ డా.వినోద్ కుమార్, అదనపు డైరెక్టర్ డా.అనిల్ కుమార్, నేషనల్ హెల్త్ మిషన్ ఎసిపిఎం కర్ర అప్పారావు, ఇమ్యునైజేషన్ పీఓ డా.దేవి, డిప్యూటీ డైరెక్టర్ గణపతిరావు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE