ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది. గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు.కాగా, నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉండటంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లతో హడావుడి కనిపించింది.