-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: శ్రీకాకుళం జిల్లాలోని రెండు చేనేత క్లస్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు టెక్స్‌టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్షన జర్దోషి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని రెండు చేనేత క్లస్టర్లకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వాటికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు వెల్లడించారు. అయితే అదే జిల్లాలోని పొందూరు క్లస్టర్‌కు ఆర్థిక సహాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని మంత్రి తెలిపారు. అలాగే పొందూరు ఖాదీకి ప్రస్తతానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) టాగ్ లేదని చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపిందని కూడా మంత్రి చెప్పారు.