హెల్మెట్ తప్పనిసరి అని..పోలీస్ శాఖ ప్రచారం పెంచింది…
ముందు వారికి ఉండాలి..వెనుక వారికి ఉండాలని..లేని పక్షంలో జరిమానాలు వేస్తున్నారు..
సరే అంతా బాగానే ఉంది…మరి జనాలు ప్రయాణించే రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి..
రాంగ్ పార్కింగ్ అంటూ ఆన్ లైన్ లో జరిమానాలు వేసేస్తున్నారు..
ఉండాల్సిన చోట పార్కింగ్ స్థలాలు ఉన్నాయా.. మీరు పార్కింగ్ నిబంధనలు పాటిస్తున్నారా..
రోడ్డు పక్క షాపులకు సెల్లార్ పార్కింగ్ ఎక్కడ…ఫుట్ పాత్ ఆక్రమణలు. ఉన్నాయి..వాటిపై మీకు అంత ప్రేమ ఎందుకు..
ముందుగా మీ పని చేయండి..
షాపు వాళ్లు రోడ్లను కూడా అద్దెలకు ఇచ్చేస్తున్నారు. అలాంటి ఆక్రమణదారులపై మీ చర్యలు ఉండవా..ప్రమాదాలు జరిగేది వీటి కారణంగానే కదా?
ప్రధానంగా నగరంలో ఆటోలు కంట్రోల్ లేదు..లైసెన్సు లేని ఆటో డ్రైవర్లే ఎక్కువ.చెవిలో సెల్ ఫోన్ ఒంటికాలితో దూసుకుపోతారు. ప్రధాన రోడ్లపై వారికిబ్రేక్ వేయడం రాదు. ఆటో వెళ్లే సమయంలో
ఎలా ఆపాలో తెలియని డ్రైవర్లు.. వీరి వలనే ప్రమాదాలు ఎక్కువ.
ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ వదలరు.ఈ విషయాన్ని పోలీసులూ పట్టించుకోరు.
ముందుగా వీటిపై దృష్టి పెడితే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది.
అందరి సమయం సేవ్ అవుతుంది. ప్రమాదాలు తగ్గుతాయి. అంతా బాగుంటుంది సీపీ సారూ.
అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా మంచిదే. ప్రధానంగా రోడ్డు క్రాస్ చేసే వారు కూడా
వాహనాలను ఆపాలంటూ అకస్మాత్తుగా వస్తూ చేతితో సైగలు చేయడం సరైనది కాదేమో..
వాహనం వెళ్లిన తర్వాత రోడ్డు దాటడం మంచిదని గ్రహిస్తే అందరికీ మంచి జరుగుతుంది..
అయితే ఒక నిముషం లేటవుతుందేమో.
వాహనాలకు అడ్డం వచ్చి హడావుడిగా వెళ్లి, సాధించేది ఏమీ లేదనేది గుర్తుపెట్టుకోవడం ద్వారా
ప్రమాదాలను కూడా నివారించుకోవొచ్చు..జరా అందరూ ఆలోచించండి.
రోడ్డు ప్రమాదాలను నివారించండి.అందరూ క్షేమంగా ఉండండి…
నగరంలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి, అప్పుడు మీరు జరిమానాలు
విధిస్తే అందరూ హర్షిస్తారు.
సౌకర్యాల కల్పనలేకుండా జరిమానాలు విధించడం, అంత భావ్యం కాదేమో?!
యోచన చేయండి సార్లూ…!!
– రాజేశ్వరరావు కొండా
సీనియర్ జర్నలిస్టు