– బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు
బీజేపీ ఫ్లోర్ లీడర్ లేకుండా సభ జరుగుతుందని అనుకోవట్లేడు. ప్లోర్ లీడర్ అంశం పార్టీ అద్యక్షుడు చూసుకుంటారు.అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం. క్యాబినెట్ సమావేశం లో ప్రజాసమస్యలపై ఎలాంటి చర్చలు జరుపలేదు.ఐదు కోట్లతో బస్సు కొన్నారు కదా..దాంతో సమస్య ఉన్న ఒక్క ప్రాంతానికైన వెళ్ళారా ?
వరద ప్రాంతాల్లో పర్యటించడానికి కనికరం లేని వ్యక్తి కేసిఆర్.ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం పక్క రాష్ట్రాల్లో రాజకీయం చేసేందుకు వెళ్తున్నారు.1500 వందల కోట్ల వరద నష్టం ఉంటే 5వందల కోట్లు మాత్రమే విడుదల చేశాడు. పంటలే కాకుండా ఇవి కాకుండా రోడ్ల పరిస్థితి ఏంటి ?
కొత్త ప్రాంతాలకు మెట్రో విస్తరణ చేపడతామని అంటున్నారు.5.5 km ల పాత బస్తీ మెట్రో చేయడమే చేత కాని కేసిఆర్ 8దిక్కుల్లో మెట్రో విస్తరణ చేస్తారంట? ఇవన్నీ ఎన్నికల తాయిలాలే..
Ab పాండ్య రిపోర్ట్ ప్రకారం కడెం ప్రాజెక్టు కు 600 కోట్లు ఖర్చు పెడితే వాటర్ కెపాసిటీ పెంచడం తో పాటు మరమత్తులు చేయొచ్చు.డ్యాం రేహాబిలిటేషన్ కింద 6వందల కోట్లలో 70శాతం నిధులు కేంద్రం ఇచ్చేందుకు రెడీ ఉంది.30శాతం నిధులు ఇచ్చేందుకు ముందుకి రాని రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క నెల లోపల మూడు రకాల పరీక్షలు పెట్టీ.. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం. చదువుకొని ఉంటే పరీక్షలు ఎలా పెట్టాలనేది తెలిసేది?
అనేక విపత్తులు వస్తున్నాయి.విపత్తు ఎదుర్కొనేందుకు తెలంగాణలో ఏదైనా కమిటీ ఉందా?ఈ అంశంపై కేబినెట్ లో చర్చించారా?సంస్థ ఆస్తుల కోసమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. కేసిఆర్ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులతో మొరంచ కు ఫుడ్ పెట్టొచ్చు. మునుగోడు, మహారాష్ట్ర మీద ఉన్న శ్రద్ధ మొరంచా మీద ఎందుకు లేదు?అయినా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కు గ్రీస్ కూడా పూయలేదు. గ్రూప్2, గురుకుల పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలి.ఫ్లోర్ లీడర్ లేకుండా సభ జరుగుతుందని అనుకోవట్లేడు.ఫ్లోర్ లీడర్ ఎవరనేది మా అధ్యక్షుడు నిర్ణయిస్తారు.