Suryaa.co.in

Andhra Pradesh

అడుగులు…పిడుగులు!

మన వయసు కుర్రాడు..
రాష్ట్రంలోనే ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడు. ..
మనందరం అన్న అని పిలుచుకునే నందమూరి తారకరామారావు గారి మనవడు..
మన తరం చూసిన గొప్ప నాయకుల్లో ఒకరైన పెద్దాయన నారా చంద్రబాబునాయుడు గారి ఏకైక వారసుడు.ప్రపంచంలోనే ఒకటైన గొప్ప విశ్వవిద్యాలయంలో చదువుకున్నోడు..
రెండు పేరున్న కుటుంబాల వారసత్వానికి మచ్చ తేకూడదన్న భారాన్ని అనునిత్యం మోస్తున్నాడు..ఈపాటికే మీకు అర్ధం అయ్యుంటుంది,ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించి అని.
మీరూహించింది, రాష్ట్ర రాజకీయంలో సరికొత్త ఒరవడిని సృష్టించే పనిలో ఉన్నది ఆయనే – నారా లోకేష్. తెలుగు మాట్లాడడం రాదన్నారు.
వేషభాషలని వెక్కిరించారు.
వ్యక్తిత్వ హననానికి దిగారు.
ఇవేవీ చాలవన్నట్టు అసలు రాజకీయానికి పనికిరాడన్నారు. కానీ తండ్రి దిద్దించిన రాజకీయ ఓనమాలు వృధా కాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా సొంత పార్టీ వారే నమ్మలేనంతగా అద్భుత ఫలితాలు చూపించాడు.ఆ తర్వాత ఒక్క ఓటమి అతని రాజకీయ భవిష్యత్తును ప్రశ్నర్ధాకంలో పడేసింది.
శత్రు మూకలు విరుచుకుపడ్డాయి.నీకేమీ చేతకాదు అంటూ హేళన చేశాయి. సొంత పార్టీ కార్యకర్తలే నమ్మకం కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.
ఇవన్నీ మనకు కనిపించిన కోణాలు.
కానీ వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి.
అతను ఆవేశపడి అప్పటికప్పుడు సమాధానం ఇవ్వలేదు. సమయం తీసుకున్నాడు.
తప్పొప్పులు బేరీజు వేసుకున్నాడు.
ఈ నవశకం రాజకీయంలో తన ఉనికి చాటుకోవాలంటే తనని తాను ఉలి చెక్కిన శిల్పంలా మలుచుకోవడమొక్కటే దారి అని తెలుసుకున్నాడు.
కుళ్ళు, కుతంత్రాలు చేస్తేనే రాజకీయం కాదు, ప్రజాక్షేత్రంలో తిరుగుతూ సామాన్య మానవుడి మెప్పు పొందడమే తన భవిష్యత్తు కార్యాచరణ అని నిర్ణయానికి వచ్చాడు.ఇదిగో..ఇప్పుడు మనం చూస్తున్న ఆ వెర్షన్ అద్భుతమే – నారా లోకేష్ 2 .0
అపరచాణక్యుడైన తండ్రి సూచనలే వంటబట్టాయో,సహనశీలి అయిన తల్లి ఆశీర్వాదాలే తోడయ్యాయో, నవతరం ప్రతినిధి అయిన సహధర్మచారిణి మద్దతే ప్రేరేపించిందో,
లేక కోట్ల మంది తెలుగుదేశం కార్యకర్తల కసి, పట్టుదల కలిసొచ్చాయో తెలియదు కానీ..
అతను మన ముందుకు రాగానే –
రాక్షస పాలనతో అలిసిన బ్రతుకులు ఆహ్వానం పలికాయి.తాను అడుగుపెట్టిన ప్రతీ నేలా అక్కున చేర్చుకుంటోంది.సామాన్యుడి కష్టాన్ని అర్ధం చేసుకుంటూ పడుతున్న అతని అడుగులు శత్రుమూకలపై పిడుగుల్లా పడుతున్నాయి.
వంద రోజులు పూర్తిచేసుకున్న యువగళం, కొత్త తరం రాజకీయ నాయకులకు ఒక స్ఫూర్తి పాఠంగా సాగుతోంది. నీ వెంట మేమున్నాం. నీ బాటలో నడుస్తున్నాం.ప్రజల కష్టాలని తీర్చు.
పార్టీని విజయ తీరం వైపు చేర్చు

– రామ్మోహన్

LEAVE A RESPONSE