Suryaa.co.in

Andhra Pradesh

18 సంవత్సరాల పాటు కోట్లాది రూపాయలు విలువ చేసే వేపదొరువు స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడా

– మాజీ కార్పొరేటర్, తెదేపా నెల్లూరు అధికార ప్రతినిధి,పార్లమెంట్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్

ఇది నెల్లూరు సిటీ బాలాజీ నగర్ ప్రాంతంలో వేపదొరువు అనే ప్రభుత్వ భూమి.
ఇది 2000 సంవత్సరం వరకు పిచ్చి మొక్కలు, మురుగు నీరు, ముళ్ల చెట్లతో నిండి ఉండేది.
ఈ స్థలాన్ని 2000 సంవత్సరంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కౌన్సిలర్ గా ఉన్న సమయంలో స్థానికుల కోరిక మేరకు , ఆ దొరువును శుభ్రం చేయించి మట్టి తోలించి మెరక చేయించి, ఆ రోజే దీన్ని మంచి పార్క్ గా చేయాలని సంకల్పించాం.

ఈ స్థలం బాగా మెరక కావడంతో ఆక్రమణ దారుల కన్ను పడి ఆక్రమణలు మొదలు పెట్టారు. అయితే ఆ నాటి నుంచి 2018 వరకు ఈ స్థలాన్ని ఆక్రమణ కాకుండా కంటికి రెప్పలా అనేకమందితో పోరాడి కాపాడాను.

ఈ స్థలం కాపాడబట్టే అక్కడ రెండు వాటర్ ట్యాంకులు కట్టగలిగాం. ఆ వాటర్ ట్యాంక్ కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోచేసిన పోరాటంలో కేసులు పెడితే కోర్టుల చుట్టూ సంవత్సరాల పాటు తిరిగా.
కోటంరెడ్డి నుడా చైర్మన్ అయిన తరువాత .. నుడా గ్రాంట్ నుంచి 60 లక్షలు రూపాయలు కేటాయించి, 2019 లో మాజీ ప్రధానిపి వి నరసింహారావు పేరుతో పార్క్ నిర్మాణం చేపట్టి ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరిగింది.

2019 లో ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ పార్కు పనులు అటకెక్కించారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైసీపీ వాళ్ళు పని ప్రారంభించకుండా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో స్థానికులను మభ్యపెట్టడానికి హడావుడిగా పనులు మొదలు పెట్టారు.

4 సంవత్సరాల పాటు వదిలేసి ఇప్పుడు మొదలు పెడుతున్నారంటే వైసీపీ వాళ్ల చిత్తశుద్ధి బట్టబయలవుతోంది. వీళ్లు చెయ్యక పోయినా 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఈ పార్కును సుందరంగా తీర్చి దిద్దుతామని తెలియచేస్తున్నాము.

ఏది ఏమైనప్పటికీ 18 సంవత్సరాల పాటు మేము కంటికి రెప్పలా కాపాడబట్టే ఈ స్థలం ఆక్రమణలు కాకుండా ఆగింది. లేకుంటే ఇక్కడ వాటర్ ట్యాంకులు కట్టలేము, పార్క్ చేయలేము. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలం కాపాడటంలో నాకు సహకరించిన మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి గారికి, స్థానికులకు, అధికారులకు, పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము.

LEAVE A RESPONSE