హసీనాకు, ఆమె కుటుంబానికి ఏం జరిగినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది

రాయదుర్గంఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి అండతో కనేకల్ గ్రామవైసీపీనేత మక్బూల్ అతనికుమారుడు ముక్దసిర్ హసీనాను చంపడానికియత్నించారు. ముగ్గురుబిడ్డల తల్లిప్రాణభయంతో ఊరొదిలి వచ్చేంతవరకు పోలీసులు చోద్యంచూశారు.
• న్యాయంచేస్తామని హసీనాను నమ్మించి ఆమెతో తెల్లకాగితంపై సంతకంపెట్టించుకున్న పోలీసులు, నిందితులకు అనుకూలంగా ఎఫ్ఐఆర్ నమోదుచేయడం దుర్మార్గం.
• జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మైనారిటీవర్గంపై వేధింపులు, దాడులు అధికమయ్యాయి.
• ముఖ్యమంత్రి చేతగానితనంతో అబ్దుల్ సత్తార్, అబ్డుల్ సలాంకుటుంబాలు బలయ్యాయి.
• చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక తప్పుచేస్తున్నవారు, వారిని సమర్థిస్తున్నవారు తగినమూల్యం చెల్లించుకుంటారు.
– టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్

అనంతపురంజిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం ఆలూరు గ్రామంలో మైనారిటీవర్గానికి చెందిన హసీనా, ఆమెభర్త హుస్సేన్ బాషాలను స్థానికవైసీపీనే తలు నానారకాలుగా హింసించారని, బాధితులు ఇచ్చినఫిర్యాదు తీసుకోకుండా అక్కడి పోలీస్ యంత్రాంగం వైసీపీఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిఆదేశాలప్రకారం వ్యవహరించారని, ఎమ్మెల్యే అనుచరులైన మక్బూల్, అతనికుమారుడు ముక్దసిర్ హసీనాను దారుణంగా హింసించి, ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారని టీడీపీ మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలానా అహ్మద్ తెలిపారు.

శనివారం ఆయన హసీనా, ఆమెకుటుంబసభ్యులతో కలిసి మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారిమాటల్లోనే . ..

మౌలానా ముస్తాక్ అహ్మద్ : అమాయకురాలైన హసీనాను, ఆమెకుటుంబాన్నిభయపెట్టి వైసీపీనేతలు మక్బూల్, అతనికుమారుడు ముక్దసిర్, వైసీపీఎమ్మెల్యే అండతో దుర్మార్గంగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగుతున్న పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ హసీనాతో తెల్లకాగితంపై సంత కం పెట్టించుకొని, తరువాత ఎఫ్ఐఆర్ రాశాడు. వైసీపీప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణలేకుండాపోయింది. గతంలో అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాం కుటుంబాలకు ఎంత అన్యాయంజరిగిందో వారికుటుం బాలు ఎలా బలయ్యాయో అందరంచూశాం.

రాయదుర్గం పక్కనున్న కళ్యాణదుర్గంలోని చావ్ పురీలో కొందరు దుర్మార్గులు మైనారిటీవర్గానికిచెందిన యువతిపై అత్యాచారంచేసి చంపేశారు. బయటకు తెలుస్తున్నఘటనలు కొన్నే.. ప్రజలకు తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎందరు మైనారిటీలు వైసీపీప్రభుత్వదురాగతాలకు బలవుతున్నారో చెప్పాల్సినపనిలేదు.
హసీనా నిన్ననాకు ఫోన్ చేసి, తమను ఆదుకోవాలని, న్యాయంచేయాలని వేడుకున్నారు. హసీనాదంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, అందరూకలిసి ఆత్మహత్యచేసుకుంటామని నాతో చెప్పుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. వారికిధైర్యంచెప్పి, చంద్రబాబుగారు తెలుగు దేశంపార్టీ అండగా ఉంటుందనిధైర్యంచెప్పి ఇక్కడకు పిలిపించాము.

వైసీపీనేతలు పోలీసుల అండతోరెచ్చిపోతున్నారు. పోలీస్ శాఖ వైసీపీవారికి తొత్తులుగా వ్వవహరిస్తోంది. అన్యాయంచేస్తూ, దుర్మార్గాలకు పాల్పడుతున్నవారిని వదిలేసి అమాయ కులపై కేసులుపెడుతున్నారు. పోలీస్ శాఖ తప్పుడుకేసులుపెట్టకుండా అమాయకులకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం. హసీనాపై అత్యాచారయత్నానికిప్రయత్నించి, ఆమెని హింసించిన ముక్దసిర్ ను స్థానిక పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీప్రభుత్వం పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 2024 లో జరిగే ఎన్నికల్లో టీడీపీభారీమెజారిటీతో గెలిచి, చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అవుతారు. వైసీపీకార్యకర్తలకంటే దారుణంగా వ్యవ హరిస్తున్న పోలీసులు తగినమూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం.

రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నా, ముస్లిం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, వారిప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ కూర్చుంటున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూచూడలేదు. మైనారిటీలకు మాయ మాటలుచెప్పి, వారిని ఓట్లకోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. గడపగడపకు అంటూ వెళ్తున్నవారందరికీ ప్రజలచేతిలో తగిన సత్కారాలుజరగడం ఖాయం. మైనారిటీలకు మేలు చేయకపోతే చేయకపోయాడుగానీ.. ఈ ముఖ్యమంత్రి వారినికనీసం స్వేచ్ఛగా బతనివ్వడం లేదు. అదే మాబాధంతా. హసీనాకు, ఆమెకుటుంబానికి ఏంజరిగినా కనేకల్ వైసీపీనేతలు మక్బూల్, అతని కుమారుడు ముక్దసిర్…స్థానికవైసీపీఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డే బాధ్య తవహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.

హసీనా (బాధితురాలు) : మా ఊరు కనేకల్. ఇలాంటి కష్టంవస్తుందని కలలోకూడా అనుకోలేదు. నాకుజరిగిన దారుణాలపై స్థానికంగా ఉండే పోలీసులెవరూ స్పందించలేదు. పోలీసుల్ని బతిమాలిన న్యాయంచేయకపోగా నన్నునమ్మించి తెల్లకాగితంపై సంతకం పెట్టించుకున్నారు. మక్బూల్ పాషా, అతని కుమారుడు ముక్దసిర్ లు నన్ను దారుణంగా హింసించారు. భయంతో ఏంచేయాలో తెలియక ముస్తాక్ అహ్మద్ గారికి ఫోన్ చేశాము. ఆయన్నినమ్మి, చంద్రబా బుగారు మమ్మల్ని కాపాడతారని ఇక్కడకు వచ్చాము.

హుస్సేన్ బాషా (హసీనాభర్త) : మేం మాఊరికి వెళితే ప్రాణాలతో మిగులుతామనే నమ్మకం లేదు. వైసీపీనేతలు మక్బూల్, అతనికొడుకు ముక్దసిర్ వారి అనుచరులు ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్నారు. వారుఏంచేస్తారో అన్నభయంతో ఊరొదిలి వచ్చేశాము. చంద్రబాబుగారు, టీడీపీనేతలు మాకు న్యాయంచేయాలని వేడుకుంటున్నాము.

అజీమున్ (రాష్ట్రమైనారిటీ సెల్ అధికారప్రతినిధి) : జగన్మోహన్ రెడ్డి , ఆయనప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు వెన్నుపోటు పొడిచింది. ముస్లిం మైనారిటీలకు చంద్రబాబుగారు గతంలో అందించిన అనేకపథకాలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రద్దుచేశాడు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి పరిపాలనలో చాలావ్యత్యాసముంది. పిల్లికళ్లమూసుకొని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి తానేంచేసినాఎవరికీ ఏమీతెలియదు లే అనుకుంటున్నాడు. మైనారిటీ వర్గమేకాదు..రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతరత్రాఘటనల్లో ఎక్కడాచూసినా వైసీపీవారు, వాలంటీర్లే నిందితులుగా ఉంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు త్వరలోనే ప్రజలంతా చరమగీతం పాడటంఖాయం.

అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు బిడ్డల తల్లి ప్రాణభయంతో ఇక్కడకు వచ్చేవరకు పోలీసులు ఏం చేస్తున్నారు? హసీనా, ఆమెభర్త ఎక్కడున్నా చంపేస్తామని బెదిరి స్తున్న వైసీపీనేతలు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలకు అంతులేదా? హసీనాను, ఆమెభర్తాపిల్లలను రక్షించాల్సిన పోలీసులు.. ఆమెను ఇంకా మానసికంగా వేధిం చారు. హసీనాను వేధించినవారిని శిక్షించాల్సిన పోలీసులు, ఆమెతో తెల్లకాగితంపై సంతకం పెట్టించుకొని, వైసీపీవారికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా? హసీనాకు, ఆమె కుటుంబానికి ఏదైనా జరిగితే, తెలుగుదేశం పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

 

Leave a Reply