-వైఎస్సార్ వారసులా… చంద్రబాబు వారసులా?
-పచ్చ మూకతో కలిసి కుట్రలా?
-ఇంతకన్నా దిగజారుడుతనం ఉందా…
-చనిపోయాక కేసు పెట్టిన దుర్మార్గమైన పార్టీతో కలుస్తావా…
-శత్రువు ఇంటికి పసుపు చీరకట్టుకుని వెళ్లి మోకరిల్లావ్…
-ఆయన రాసిన స్క్రిప్టునే చెల్లెమలు చదువుతున్నారు
-అవినాష్ తప్పు చేయలేదని నమ్మా… అందుకే టికెట్ ఇచ్చా…
-చిన్న పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేందుకు పెద్ద పెద్ద -వివేకాను కుట్రతో ఓడిరచిన వారితో చెట్టపట్టాలా…
-మహానేతకు ఎవరు వారసులో ప్రజలే చెబుతారు…
-పులివెందుల బహిరంగసభలో సీఎం జగన్ వ్యాఖ్యలు
వైయస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. మన పులివెందుల, నా పులి వెందుల, మనందరి పులివెందుల.. మనకే కాదు. మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువునా నింపింది మీ పులివెందుల బిడ్డలే అని సగర్వంగా చెబుతున్నా. కాబట్టే మన ప్రత్యర్థులకు ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ 5కు, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ, ఒ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం. మంచి చేయటం మన కల్చర్. మంచి మనసు మన కల్చర్. మాట తప్పక పోవటం మన కల్చర్. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్.
ఓ వైఎస్సార్, ఓ జగన్ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి వారంతా ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నా రో మీరే చూస్తున్నారు. వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులం అని మీ ముందుకు వస్తున్నారు. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగు తున్నాను… ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు? ప్రజలు కాదా? ఆయన ను ప్రేమించేవారు కాదా? అని అడుగుతున్నాను. దివంగత వైఎస్సార్‌పై కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పెట్టింది ఎవరు? వైఎస్సార్ కుటుంబా న్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు. వైయస్సార్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతిఒక్కరికీ తెలుసు. మరి ఇప్పుడు అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా…వైఎస్సార్ వారసులు అని అడుగుతున్నాను.
వైఎస్సార్ బతికున్నంత కాలం ఆయనపై కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి, వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ, వారి స్క్రిప్టులను మక్కీ టు మక్కీ చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు? వైయస్సార్ కీర్తి ప్రతిష్టలను, ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, ఆయన విగ్రహాలు ఉండకూడదని ముక్కలు చెక్కలు చేస్తామన్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు అని అడుగు తున్నాను? రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా. ఒక్కడిపై వాళ్లందరూ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు ఏ స్థాయిలో పతనమైపోయాయో గమనించ మని కోరుతున్నా.
చిన్నాన్న వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసు…
వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించా రో..వారి వెనకాల ఎవరు ఉన్నారో కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. అవును నేనే చంపాను అని బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో? మీరు రోజూ చూస్తూ నే ఉన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ప్రలోభాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిరచిన వారితోనే ఈరోజు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి అని అడుగుతున్నా. చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆ రెండో భార్యతో సంతా నం ఉన్న మాట వాస్తవం కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్లాడు? వంటి అనేక ప్రశ్నలపై అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని ఎవరైనా ఆయన వైపు మా ట్లాడితే చాలు వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తుం డడం ధర్మమేనా? చిన్నాన్నను ఓడిరచిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్ వారసులా? చంద్రబాబు వారసులా?
ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టిన, చనిపోయిన వైఎస్ పేరును చార్జ్‌షీట్‌లో పెట్టిన ఆ కాంగ్రెస్‌తో పంచన చేరి ఆయన పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటం వల్ల ఎవరికి లాభమో ఆలోచించాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? అని అడుగుతున్నాను. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అని అడుగుతు న్నాను. వైఎస్ మీద అసలు ప్రేమ ఎవరికి ఉందో గమనించమని అడుగుతున్నా. ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు కుట్రలు చేస్తున్నారు అన్నది గమనించమని కోరుతు న్నా. ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైఎస్సార్ వారసులా? లేక ఆయన ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా? అని మీరే ఆలోచన చేయమని అడుగుతున్నా అని ప్రశ్నించారు.
అవినాష్ తప్పు చేయలేదని నమ్మా…అందుకే టికెట్ ఇచ్చా
పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చుకున్నా. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలకు మంచి చేసేందుకు..జగన్ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టాడని చెబుతున్న నా బంధువులకు తెలియజేస్తున్నా. అవినాష్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను… కాబట్టే టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్నపిల్లాడైన అవినాష్‌ను దూషించడం, తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమో అన్నది ప్రతిఒక్కరూ గమనించమని అడుగుతున్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా అని అడుగుతున్నా.
జగన్‌ను కొట్టలేకే కుట్రలు…వారికి గుణపాఠం చెప్పాలి
ఈరోజు పులివెందుల, కడప, ఈ రాష్ట్రం మొత్తం తెలుగు నేలమీద ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా జరుగుతున్న పాలన, అంది స్తున్న పథకాలు చూశారు.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం ఇవన్నీ మన మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? అని అడుగుతున్నా.
జగన్‌ను పాలనలో కొట్టలేరు, చేసిన మంచిలో కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. తమ 14 ఏళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాం అని కూడా చెప్పుకోలేరు. అందుకే ఓటు ద్వారా వారందికీ గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ మరణం తర్వాత పదేళ్లపాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను పట్టించుకున్నారా? మళ్లీ పులివెందుల దశ మారింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా? అని అడుగుతున్నా. మరోసారి మీ బిడ్డను, అలాగే అవినాష్‌ను గెలిపించాలని చేతులు జోడిరచి వేడుకుంటున్నా.