Suryaa.co.in

Andhra Pradesh

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు : విజయ్‌ కుమార్‌

విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్‌ కుమార్‌ తెలిపారు.

LEAVE A RESPONSE