Suryaa.co.in

Andhra Pradesh Crime News

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

గుంటూరులో, ఉద్యోగం ఇచ్చిస్తామని మోసం చేసిన ముగ్గురిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం ఒంగోలులో ఏఎస్ఐగా పనిచేస్తున్న మాబాషా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరుకు చెందిన మోహిని వద్ద నుంచి రూ. 9. 75 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు ఇవ్వమంటే రూ. 2. 20లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE