-ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన గద్దర్ , తన పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. నేడు ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి. మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నాను. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారు. పాటనే తూటాలుగా మలచి , తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను తన రచనతో, తన గానంతో ఎలుగెత్తి చాటారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. తుది శ్వాస విడిచే వరకూ ప్రజా హక్కుల గురించే ఆలోచించారు. నెల్లూరు టౌన్ హాల్లో గద్దర్ ని తొలిసారి కలిసినప్పటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకూ ఆయనతో అనుబంధం కొనసాగింది. గద్దర్ అనే పేరు తలుచుకోగానే కాలికి గజ్జె కట్టి ఆడిపాడిన పాట గుర్తుకొస్తుంది. అలాగే, ప్రజల గురించిన పాట బతికినంత కాలం గద్దర్ పేరు చిరంజీవిగానే ఉంటుంది.