– ప్రభుత్వ అసమర్ధత వల్లే రైతుల ఆత్మహత్యలు
• రైతుల్ని పరామర్శించడం పవన్ కళ్యాణ్ తప్పా?
• దమ్ముంటే కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష పరిహారం ఇవ్వొద్దని ప్రకటించండి
• పవన్ కళ్యాణ్ ని తిట్టేందుకే మంత్రి పదవులు
• పాత పాలేర్ల స్థానంలో కొత్త పాలేర్లు వచ్చారు
• గుంటూరులో మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చారు.. వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. విమర్శలు చేసే వైసీపీ నాయకులకు దమ్ముంటే రైతుల్ని పరామర్శించడం తప్పు అని ప్రకటనలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ అసమర్ధత వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసమే పదవులు ఇచ్చినట్టు మంత్రుల తీరు చూస్తే అర్ధం అవుతోందన్నారు. మంత్రి పదవుల్లో పాత పాలేర్ల స్థానంలో కొత్త పాలేర్లు వచ్చారని మండిపడ్డారు. సోమవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతు కుటుంబాల కష్టాలు చూసి చలించి, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి భరోసా నింపేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందిస్తున్నారు. కౌలు రైతు భరోసా నిధి ఏర్పాటు చేసి ఆయన కష్టపడి సంపాదించిన సంపాదన నుంచి రూ.5 కోట్లు అందించారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో 71 మంది రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించారు. కష్టాల్లో ఉన్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడమే పవన్ కళ్యాణ్ చేసిన తప్పా? ప్రభుత్వ విధానాల కారణంగా మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన అనగానే పని కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబం చుట్టూ అధికారులు పరిహారం ఇస్తామంటూ తిరుగుతున్నారు. చనిపోయిన వెంటనే ఆ రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోలేకపోయారు. మీరు చేయరు మేము చేస్తామంటే ఓర్వలేరా? పవన్ కళ్యాణ్ రైతుల్ని పరామర్శించడం తప్పా? తప్పు అయితే అదే విషయాన్ని విమర్శలు చేసే నాయకులు మీడియా ముఖంగా ప్రకటన చేయాలి. పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష ఇవ్వకూడదు అని దమ్ముంటే ప్రకటించండి. విమర్శలు చేసే మంత్రుల్లో ఆ ధైర్యం ఎవరికుంది?
పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసమే జగన్ రెడ్డి వీరికి మంత్రి పదవులు ఇస్తున్నట్టున్నారు. ఈ మంత్రుల్లో ఎవరికైనా ప్రజా సమస్యల మీద అవగాహన ఉందా? గతంలో మంత్రులుగా ఉన్న పాతపాలేర్ల స్థానంలో ఇప్పుడు కొత్త పాలేర్లు వచ్చారు. అంతకు మించి మార్పు కనబడడం లేదు. ఈ మంత్రులకు కనీసం వారి శాఖల మీద కూడా అవగాహన లేదు. అంబటి రాంబాబుకు ఆయన శాఖ గురించి ఏమైనా తెలుసా? అంబటి చరిత్ర అంతా చీకటిమయం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన్ను గన్ మెన్ ఎందుకు కొట్టారో చెప్పాలి. ఎంత మంది మహిళలు చెప్పులతో కొట్టారో చర్చపెట్టాలి. రేపల్లె నుంచి ఎందుకు పారిపోయారో ప్రజలకు చెప్పాలి.
మీ అసమర్ధత వల్లే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంది. ఇంకా సినిమాలు తీస్తారా? మీ కోసం అద్భుతమైన టైటిల్స్ సిద్ధంగా ఉన్నాయి. నేరస్తుడు అనే టైటిల్ తో త్వరలో మీ నాయకుడిపై సినిమా రాబోతోంది. రాంబాబు రాసలీలలు, అరగంట రాంబాబు, పారిపోయిన అంబటి అనే పేర్లతో టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయంట. అంబటి రాంబాబు చరిత్రపై సినిమాలు తీయడానికి జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ లు సరిపోతాయి. నోరు అదుపులో పెట్టుకోకపోతే అంబటి చరిత్ర మొత్తం సీరియల్స్ గా తీయాల్సి ఉంటుంది అని అన్నారు.
గతంలో చించుకున్న వారంతా గొడ్ల చావిళ్లకు పరిమితమయ్యారు – బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… “రైతు సమస్యల గురించి మాట్లాడితే మహిళల్ని కించపరిచే విధంగా వైసీపీ కొత్త మంత్రులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసమే వీరికి కొత్తగా మంత్రి పదవులు ఇచ్చినట్టున్నారు. గతంలో చించుకున్న మంత్రులంతా గొడ్ల చావిళ్ళకు పరిమితమయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం. అందులో రహస్యం ఏమీ లేదు. వైసీపీ నాయకుల్లా మాకెవ్వరికీ చీకటి బతుకులు లేవు. వ్యభిచార గృహాలు నడిపే వైసీపీ నేతలా మా పార్టీని విమర్శించేది? కాలేజీ రోజుల్లో అమ్మాయిలను ఏడిపించి రెండు రోజుల్లో పోలీస్ కస్టడిలో ఉన్న రోజులు సదరు మంత్రి మర్చిపోయినట్టున్నారు. విశాఖలో మంత్రి అమర్నాథ్ భూ కబ్జాల పై జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. జనసేన పార్టీ ఏ కులానికీ కొమ్ము కాయదు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే వారి ఇళ్లు ముట్టడిస్తాం. జనంతో తన్నులు తినే పనులు వైసీపీ నాయకులు మానుకుంటే మంచిది.
ఇది ఆలీబాబా 40 దొంగల ప్రభుత్వం – నయూబ్ కమాల్
పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ మాట్లాడుతూ.. “వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఆలీబాబా 40 దొంగల్లా ఉంది. ఈ ప్రభుత్వం మీద జగన్ రెడ్డి – 151 మంది దొంగలు అనే కొత్త టైటిల్ తో సినిమా తీయాలి. తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని నడి రోడ్డు మీద దించి కార్లు ఎత్తుకెళ్లడం దొంగల ముఠా పని కాదా? రోడ్ల వెంట బారీకేడ్లు లేకుండా బయటకు వచ్చే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. జగన్ రెడ్డి పర్యటన ఉంది బయటకు వస్తున్నారంటే జనం భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే జగన్ రెడ్డి భయపడుతున్నారు. ఇతర కులాల నేతలతో పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తున్నారు. రెడ్డి కుల నేతలు మాత్రం పెద్ద మనుషుల్లా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. రెడ్డి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదో వైసీపీలో ఉన్న కాపు నేతలు ఆలోచించుకోవాలి. సొంత డబ్బు రైతులకు ఇస్తున్న గొప్ప నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ , జిల్లా అధికార ప్రతినిధులు ఆళ్ళ హరి , తవిటి భావన్నారాయణ , ఉపాదక్ష్యులు అడపా మాణిక్యాలరావు , శ్రీమతి బిట్రగుంట మల్లిక , ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్ , దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.