బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తు

-వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 25-30 సీట్లు ఇవ్వబోతున్నారు
-కేసీఆర్ తో పీకే మంతనాల వెనుక ఉన్న మతలబు ఇదే
-కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే…
-కాంగ్రెస్ లో గెలిచేటోడు అమ్ముడుపోతాడు .. ఓడిపోతే పార్టీనే అమ్మేస్తాడు
-పాతబస్తీ మాదే… యావత్ తెలంగాణ మాదే..
– రూ.1400 కోట్లతో పూర్తయ్యే ఎత్తిపోతల పథకానికి అంచనాలు పెంచి రూ.70 వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు దండుకుంటున్న కేసీఆర్
-ఉమ్మడి పాలమూరుకు కేసీఆర్ చేసిందేమిటో టీఆర్ఎస్ చెప్పాలి
-కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టేందుకే ప్రజా సంరామ యాత్ర
-మక్తల్ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పొత్తుకు సిద్దమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 25 నుండి 30 సీట్లు కేటాయించబోతున్నారని చెప్పారు. బీజేపీ అంటే భయం పట్టుకున్న కేసీఆర్ పీకేను పిలిపించుకుని మంతనాలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 12వ రోజు మక్తల్ మండలంలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ మక్తల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ సభకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ పావని మల్లికార్జున్ సహా పెద్ద ఎత్తున స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బండి సంజయ్ ను చూడగానే సభకు హాజరైన ప్రజలంతా చప్పట్లు, ఈలలలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…

బీజేపీ సభలకు జనం రావడం లేదని టీఆర్ఎస్ నేతలు కారు కూతలు కూస్తున్నరు. ఒక్కసారి వచ్చిన జనాన్ని చూడండి.. విజయోత్సవ ర్యాలీలా పండుగ వాతావరణంలా మక్తల్ పట్టణం ఉంది.
కాషాయ జెండా తప్ప వేరే జెండాకు స్థానం లేదు. ఆంజనేయ స్వామి సన్నిధిగా మక్తల్ ప్రజలు మామూలోళ్లు కాదు.. బరిసెలు పట్టి కేసీఆర్ పాలనను పొలిమేర దాటి కొట్టేందుకు సిద్దంగా ఉన్నరు. కానీ కేసీఆర్ మంత్రివర్గంలో ఓ మూర్ఖుడు అజయ్ కుమార్ రంజాన్ వస్తే పేరు మార్చుకుని అజయ్ ఖాన్ అని ఫ్లెక్సీలు పెట్టుకున్నడు.
నేను భారతీయుడిగా పుట్టడం నా అద్రుష్టం. అందులో హిందువుగా పుట్టడం నా పూర్వ జన్మ సుకృతం. రంజాన్ పండగొస్తే ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలని ఫ్లెక్సీలు 80 శాతం మంది హిందువుల తరపున మాట్లాడితే మతతత్వ పార్టీ అన్నా పట్టించుకోం… ఎంఐఎం లాంటి కుహాన శక్తులను తరిమికొట్టడానికే ప్రజా సంగ్రామ యాత్ర.

పాతబస్తీ ఎంఐఎం అడ్డా కాదు… పాతబస్తీ మాదే. హైదరాబాద్ మాదే.. మక్తల్ మాదే… నారాయణపేట మాదే… తెలంగాణ మొత్తం మాదే.. కాషాయ జెండా రెపరెపలాడించి తీరుతాం… కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుంది. అందుకే పీకేను పిలిపించుకుండు. ఆ పీకే ఏం పీకలేడు. నీ గుండు గీకడం తప్ప…
ఈ పీకే కాంగ్రెస్ లో ఏఐసీసీ నాయకుడు అవుతడట. పీకే బ్రేక్ ఫాస్ట్ ఏఐసీసీ లో చేస్తడు.. లంచ్ ప్రగతి భవన్ లో… డిన్నర్ ఫాంహౌజ్ లో చేస్తడు..కాంగ్రెస్ లో గెలిచే నాయకుడు అమ్ముడు పోతడు.. ఓడిపోయే నాయకుడు కాంగ్రెస్ నే అమ్మేస్తడు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 25 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ ఇవ్వబోతోంది.
ఏనాడూ బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదు. పొత్తు పెట్టుకోలేదు. టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రతిపక్ష పార్టీ బీజేపీనే. ఒకనాడు 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఈనాడు 303 ఎంపీ స్థానాలతో తిరుగులేని విజయం సాధించింది.

బీజేపీ యాడుందంటవా?… నీ టీఆర్ఎస్ పిసరంత పార్టీ…ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసి భయపెట్టాలనుకున్నరు. కానీ ఏం చేయలేకపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు టీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలి…. ఒక్క ప్రాజెక్టునైనా కట్టినవా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 69 జీవో పేరు తీసి రూ.1400 కోట్లతో కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని చూస్తే… కేసీఆర్ వచ్చాక పాలమూరు-రంగారెడ్డి పేరుతో అంచనాలను రూ.70 వేల కోట్లకు పెంచి కమీషన్లను ఎత్తిపోసుకోవాలనుకున్న దుర్మార్గుడు కేసీఆర్..
కాళేశ్వరం ప్రాజెక్టును సైతం లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టి తన ఫాంహౌజ్ కు మాత్రమే నీళ్లు తెచ్చుకుని వేల కోట్ల కమీషన్లు దోచుకుతిన్నడు. సంగం బండ ద్వారా 60 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉన్నా… కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు..నరేంద్రమోదీ పేదల మనిషి. పేద కుటుంబం నుండి వచ్చిన మనిషి. కేంద్రం అందించే సంక్షేమ పథకాలన్నీ పేదలకు అందాలని తపన పడుతున్న నాయకుడు.

మక్తల్ లో ఇంతో అంతో అభివ్రుద్ధి జరుగుతున్నదంటే కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రమే… రాష్ట్రం చేసిందేమీ లేదు.. మక్తల్ మున్సిపాలిటీ అభివ్రుద్ధి కోసం స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నా… టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే సహకరించకుండా మక్తల్ ప్రజలను వెనుకబడేలా చేస్తున్నరు.మక్తల్ లో బీజేపీ గెలిచిన తరువాత టీఆర్ఎస్ అడుగడుగునా వేధిస్తున్నారని, కనీసం తనకు జీతం కూడా ఇవ్వడం లేదని మున్సిపల్ ఛైర్ పర్సన్ చెప్పి బాదపడుతుంటే గుండె రగిలిపోతోంది.

మక్తల్ లో 100 పడకల ఆసుపత్రి లేదు… ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు.. దీనిపై మాట్లాడాలని అడుగుతుంటే… అది చేయకుండా ఇక్కడి బీజేపీ కౌన్సిలర్లను ఎట్లా వేధించాలి? ఎట్లా టీఆర్ఎస్ కండువా కప్పాలని ఎత్తులు వేస్తున్నరు.
మీరేం బాధపడకండి… రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. వచ్చాక మక్తల్ మున్సిపాలిటీకి నిధులిస్తాం. అన్ని విధాల అభివ్రుద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం…మక్తల్ నియోజకవర్గంలో అమలవుతున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలన్నీ కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తున్నయ్. రేషన్ బియ్యం, కమ్యూనిటీ హాళ్లు, రైతు వేదికలు, నీళ్లు సహా స్మశాన వాటికల పైసలు కూడా కేంద్రమే ఇస్తోంది.

ఇండ్ల కోసం తెలంగాణ కు 1.40 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే వాటిని కట్టకుండా ఆ నిధులన్నీ దారి మళ్లించుకున్న మూర్ఖుడు కేసీఆర్… నిలువ నీడలేని పేదలకు కావాల్సింది ఇల్లు తప్ప డబుల్, త్రిబుల్ బెడ్రూం ఇళ్లు కాదు… దీనిపై మా నాయకుడు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిల్ వేస్తే… తక్షణమే పూర్తయిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే లబ్ది దారులకు ఇవ్వాలని న్యాయ స్థానం ఆదేశించింది.
మీలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనయ్? మరి కేసీఆర్ ను ఎందుకు అమలు చేయడం లేదు? నేను అర్బన్ డెవలెప్ మెంట్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా నేను రాష్ఠ్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే 7 వేల ఇండ్లు మాత్రమే కట్టామని సమాధానం ఇచ్చింది.

కేంద్రం మంజూరు చేసిన 1.4 లక్షల ఇండ్లు నిర్మిస్తే… మోదీగారితో మాట్లాడి మరో 2 లక్షల ఇండ్లు మంజూరు చేయిస్తానని కేసీఆర్ కు చెబితే… ఇంతవరకు స్పందించని వ్యక్తి ఈ సీఎం. ఇక్కడున్న ఒక్కొక్కరి పేరు మీద కేసీఆర్ లక్ష రూపాయల అప్పు చేసిండు.. కేసీఆర్ మన చేతికి చిప్ప ఇచ్చిండు. అధికారం పోయాక అమెరికాకు చెక్కేస్తడు. డిస్కంలకు కరెంట్ బకాయిలు రూ.70 వేల కోట్లు కేసీఆర్ బాకీ ఉన్నడు. ఫస్ట్ తారీఖు వచ్చాక కరెంట్ బిల్లులను చూస్తే షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలను పెంచిండు..
పాతబస్తీలో కరెంట్ బిల్లులు వెయ్యి కోట్లున్నయ్. బకాయిలను వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్. ఎందుకు కట్టడం లేదని సిబ్బంది అడిగితే.. పాతబస్తీలో వెంటబడి కొడుతున్నారు. ఉచిత కరెంట్ పైసలు కేసీఆర్ ఇవ్వడం లేదు… ఉచిత కరెంట్ పేరిట డిస్కంలకు రూ.70 వేల కోట్ల బకాయిలున్నడు. ఇవన్నీ నిలదీస్తుంటే.. కేంద్రం పెట్రోలు ఛార్జీలను పెంచుతుందంటూ అంటుండు… ఒక్కో లీటర్ పెట్రోలుపై కేసీఆర్ రూ.30 లు దొబ్బుకుపోతున్నడు. ఆ ధర తగ్గిస్తే లీటర్ పెట్రోల్ ధర రాష్ట్ర ప్రజలకు రూ.90లోపే అందుతుంది. కర్నాటకలో పెట్రోలుపై వ్యాట్ తగ్గించారు. మనకంటే తక్కువ ధరకు పెట్రోలు పోస్తున్నారు. మరి ఇక్కడెందుకు పోయరు?

ఇవన్నీ తెలిసి ఓడిపోతామని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని భయపడి కేసీఆర్ పీకేను తెచ్చుకున్నడు. కాంగ్రెస్, ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ పనిచేస్తున్నయ్… వందలాది మంది పేదల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పేదలకే న్యాయం జరగడం లేదు. ప్రజలారా… గడీల రాజ్యం కావాలా? గరీబోళ్ల రాజ్యం కావాలా? ఆలోచించండి.
కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి గరీబోళ్ల రాజ్యం తీసుకురావడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినం.కేసీఆర్ గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీ అయ్యింది. తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను పొలిమెర దాటించే దాకా తరిమితరిమి కొట్టాలని తెలంగాణ తల్లి ఘోషిస్తోంది. అందుకే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా…. స్వామి వివేకానంద ఏమన్నాడంటే.. 100 యువకులను నాకు ఇస్తే… సమాజ రూపు రేఖలనే మారుస్తానన్నడు..
శివాజీ వారసులారా… ఏడాది సమయం ఇవ్వండి. టీఆర్ఎస్ ను తరిమికొడదాం రండి…బీజేపీ వల్లనే కేసీఆర్ ను ఫాంహౌజ్ నుండి ప్రగతి భవన్ కు.. .అక్కడినుండి ఇందిరా పార్క్ వద్దకు లాక్కొచ్చిన పార్టీ .. రాష్ట్రం మొత్తం తిప్పిన పార్టీ.. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు అధికారం ఇచ్చారు. మీకు ఏమీ చేయలేదు… ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ రూపురేఖలు మారుస్తాం…
నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు ఇవ్వడం లేదని బీజేవైఎం యువమోర్చా ఆధ్వర్యంలో ఉద్యమిస్తే.. లాఠీ ఛార్జ్ చేశారు.. కేసులు పెట్టి జైల్లో పెట్టారు. మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ పై ఎన్నో కేసులు పెట్టారు. అయినా భయపడకుండా మిలియన్ మార్చ్ నిర్వహిస్తే అసెంబ్లీని ముట్టడిస్తానని హెచ్చరిస్తే దిగొచ్చి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నడు.

జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్ మాట్లాడుతూ..
తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. పోలీసులు 5 నిమిషాలు యూనిఫామ్ పక్కన పెట్టండని ఒవైసీ చేసిన సవాల్ కేసీఆర్ కు వినపడలేదా?… కేసీఆర్ కోసం,కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. తెలంగాణ లో ఇకముందు గులాబీ జెండా కు స్థానం లేదు,కేవలం కాషాయ జెండాను మాత్రమే ఉంది..బండి
.కేసీఆర్ ను ఇంకా భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందా?..
కేసీఆర్ ను తెలంగాణ పోలిమేర లకు తరిమి కొట్టండిఫామ్ పక్కన పెట్టండని ఒవైసీ చేసిన సవాల్ కేసీఆర్ కు వినపడలేదా?…

జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ :
అబద్ధపు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ నిజస్వరూపం ఏంటో చెప్పడానికే బండి సంజయ్ పాదయాత్ర. ఎర్రటి ఎండలో సైతం బండి సంజయ్ నడుస్తుంటే పాలమూరు ప్రజలు బిజెపిని ఆశీర్వదిస్తున్నారు. మక్తల్ లో రోడ్లన్నీ దుమ్మ కొట్టుకుపోయినయ్.. రోడ్లపై ప్రయాణించాలంటే దేవుడు కన్పిస్తున్నడు. పౌడర్ పూసుకున్నట్లుంది. కేసీఆర్ చెప్పే అబద్దాలకు అంతు లేకుండా పోయింది. అబద్దం చెబితే తల నరక్కుంటానంటాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఇప్పటి వరకు ఎన్ని సార్లు తల నరుక్కున్నాడు? నరుక్కున్న ప్రతిసారి తల పుట్టుకొస్తూనే ఉంది. కేసీఆర్ తో కలిసి పీకే ఏం పీకుతాడో.. బీజేపీని ఏమీ చేయలేరు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.

Leave a Reply