Suryaa.co.in

Devotional

గణపతి రూపం

ఎరుపు రంగు మానవదేహం ఏనుగు తలతో ఉన్న గణపతి రూపాన్నే అత్యధికులు అంగీకరిస్తున్నారు. ఆయన రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయింది. ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి. రెండు చేతుల్లో పాశం, అంకుశం ధరించి ఉంటాడు. తక్కిన రెండు చేతులు అభయవర ముద్రలు వహించి ఉంటాయి.
ఆయన ఉదరం పెద్ద పరిమాణంలో ఉండి, నాగవడ్డాణంతో అలంకరించబడి ఉంటుంది. దారంతోనో లేక సర్పంతోనో రూపొందించిన యజ్ఞోపవీతం ఒకటి ఆయన ధరిస్తాడు. ఆయన పద్మాసనం వేసుకొని ఉంటాడు. ఆ ఆసనంలో కూర్చోవడానికి ఉదరం ఆటంకమైతే కుడికాలు మడిచి పీఠం మీద ఉంచుతాడు.
సుందరమైన దుస్తులు, ఆభరణాలను మాత్రమే కాకుండా ఆయన రమణీయమైన ఖచిత కిరీటాన్నీ ధరిస్తాడు. తొండం ఎడమ లేక కుడి వైపుకు తిరిగి ఉండవచ్చు. సాధారణంగా ఆయన పెద్ద సంఖ్యలో మోదకాలను ఆరగిస్తూ కానవస్తాడు. హాస్యాస్పదమైన పరిమాణంలో ఉండీ, ఆయనను మోయడానికి సరిపడే బలాన్ని పుంజుకోవడానికా అన్నట్లు తన వంతు మోదకాలను కొరుకుతూ ఒక మూషికం ఆయన ప్రక్కన కనబడుతుంది. నుదుటపై కనుబొమల నడుమ కొన్ని సమయాల్లో మూడవ కన్ను అదనంగా కనబడవచ్చు శిరస్సులు అయిదు వరకు ఉండవచ్చు. భుజాలు రెండు నుంచి పది వరకు ఉండవచ్చు. పద్మం, దానిమ్మపండు, జలపాత్ర, గండ్రగొద్డలి, ఉండవచ్చు.

LEAVE A RESPONSE