మాటల మాంత్రికుడు
మా పాత్రుడు..
నిజ జీవితానికి
అద్దం పట్టే నాటికలు..
సమాజంలోని పోకడలకు
సజీవ వాటికలు..
కొడుకు పుట్టాల..
ఈ రచన గణేష్ పాత్రో
ప్రతిభకు బహువచన..
అన్ని భాషల్లోకి అనువాదమై
అదే ఓ ఆధునిక వేదమై..!
కలం పట్టిన
అయిదేళ్ల కాలంలోనే
కలకాలం నిలిచి ఉండే
రచనలు చేసిన పాత్రో
జనం రుగ్మతలపై
చేశాడు జావలిన్ త్రో..
సున్నితంగా సమస్యని ఆవిష్కరించే శైలి..
కలంతో ఆయన ఆడే కథకళి!
మనుషులంటేనే మంచోళ్ళురా..
సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టుకు
అంటు కట్టిన ఈ మాట..
పుట్టింది గణేష్ పాత్రో
ముంగిలిలోని మాటల
పూదోటలోనే..!
హలో గురూ
ప్రేమ కోసమేరా జీవితం..
ఇది లవ్వుపై పాత్రో ఇంగితం
వాడి కిందనే మనం ఉంటామటగా..
సీతారామయ్య మనవరాలు
సినిమాలో హత్తంగడి చమక్కు..
అంతటి అక్కినేనికి చురుక్కు..
కాదల్ కి నేరమిల్లే..
ప్రేమించడానికి టైం లేదు..
ఇది అర్థమే అయినా
ఇక్కడ ఉందంటూ హరిబాబుతో పలికించి
కమల్..బాలచందర్ తో
కలిసి సృష్టించాడు మరోచరిత్ర..
చిరంజీవి రుద్రవీణ పలికిస్తే
పాత్రో మ్రోగించాడు
పదునైన మాటల మోత..
పుట్టింది పార్వతీపురం..
అక్కడే ఆవిష్కరించాడు రచనల గోపురం..
గణేష్ పాత్రో జయంతి
-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286