Suryaa.co.in

Features

‘చెత్త’ ఆలోచనలు..

మీ దేశంలో పరిసరాలు ఇంత శుభ్రంగా ఉండడానికి
కారణం ఏంటి..ఇది ప్రశ్న..

వివిధ దేశాల సమాధానం
ఇలా ఉంది..

అమెరికా..
మేము ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ
శుభ్రం చేస్తుంటాం..

ఇంగ్లండ్..
అసలు మేము మురికి చెయ్యం…

జపాన్..
మా దేశంలో ఎప్పటి
చెత్తను అపుడే తొలగించే
యంత్రాలు కనిపెట్టి
వాడుతున్నాం..

చైనా..
మా దేశంలో చెడ్డది ఏదైనా
వెంటనే కరోనా మాదిరి ఇతర దేశాల్లోకి తోసేస్తాం..

పాకిస్తాన్
మా దేశమూ శుభ్రంగా ఉండదు..మా మనసులూ ఉండవు..
అందుకే మా చెత్తను ఇండియాలోకి విసిరేస్తాం!

ఇక చివరగా ఇండియా..
మేము చెత్తను పక్కింటి ముందు పారబోస్తాం..
పక్కింటోళ్ళు మా ఇళ్ల ముందు పారబోస్తారు..
ఈలోగా మునిసిపాలిటీ వాళ్ళు తుడుస్తూ కాలువలోకి ఒంపేస్తారు..
కాలవలు క్లీన్ చేసే వాడు వచ్చి మళ్లీ రోడ్డు మీద పడేస్తాడు..
దీన్నే మేము రీసైక్లింగ్
అంటాము

ఆంధ్రప్రదేశ్
ఇదంతా చెయ్యడానికి
జనం మునిసిపాలిటీకి
కట్టే ఎన్నో పన్నులు కాక కొత్తగా..చెత్తగా…
ఉత్తపుణ్యానికి చెత్త పన్ను
వేసి ముక్కు మూసుకుని ఉన్న ప్రజల ముక్కు పిండి
వసూలు చేయడానికి
వలంటీర్లను ఉసిగొల్పి
జీవితాలను మసి చేస్తున్నారు.ఆ పన్నే వలంటీర్లకు జీతమట..
అడ్డగోలు..అడ్డదిడ్డం!!

– సురేష్ కుమార్ ఇ

LEAVE A RESPONSE