Suryaa.co.in

Entertainment

పుష్పపై గరికపాటి ఫైర్‌

– స్మగ్లింగ్‌ చేసేవాడు ఏదో ఘనకార్యం చేసినట్లు తగ్గేదేలే అంటాడా?
– పుష్పలో స్మగ్లర్‌ను హీరోగా చూపించారు

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పుష్ప సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉందన్న ఆయన సమాజానికి మంచి సందేశం ఇచ్చే చిత్రాలు కరువయ్యాయి అని అన్నారు.

ఇటీవల విడుదలైన పుష్పలో స్మగ్లర్‌ను హీరోగా చూపించారు. అలా ఎలా చూపిస్తారంటూ ఆయన మేకర్స్‌ని ప్రశ్నించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం చెడు చూపించి చివరి 5 నిమిషాల్లో మంచి చూపిస్తాం అంటారు. దానికి మళ్లీ రెండో పార్ట్‌ తీసుకొస్తున్నారు. ఈలోపు సమాజం చెడిపోవాలా? స్మగ్లింగ్‌ చేసేవాడు ఏదో ఘనకార్యం చేసినట్లు తగ్గేదేలే

అంటాడా? ఇప్పుడు ఇదొక సూక్తిలా తయారైంది. తగ్గేదే లే అన్నది శ్రీరాముడు, హరిశ్చంద్రుడు లాంటి వారు ఉపయోగించాలి. స్మగ్లర్లు కాదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

LEAVE A RESPONSE