నిజమే రామానిజం…

Spread the love

అద్వైతమే రామానుజుని అస్థిత్వo అద్వైతానికి తన తత్వం…
మానవత్వం…
జోడించి ప్రతిపాదిస్తే అదే విశిష్టాద్వైతం…

మానవతే దాని మతం…
ప్రపంచానికి అదే అయింది సమ్మతం…!!!

తిరుగులేని కర్తవ్యదీక్ష…
మొక్కవోని ధైర్యం…
దేవునిపై నమ్మకం…
అదే అదే రామానుజ వేదాంతం…
వేదాంతంలో ఆయన ఆవిష్కరించిన కొత్త సిద్ధాంతం…!

ఆచారాలు పురోగతికి అడ్డుకారాదన్న రామానుజ సూత్రం…
ఆయన నమ్మిన తారకమంత్రం…

ఒకనాటి ఆచారం ఈనాటి సమాజశ్రేయస్సుక అడ్డమైనపుడు, అవసరమైతే మార్చేయ్…
లేదంటే తీసెయ్…
ఈ క్రమంలో ఎంతటి పోరుకైనా రామానుజ సై సై!

పూజ…తద్వారా మోక్షం…
ఇవి మానవుని హక్కులంటూ ఉద్బోధించిన రామానుజుడు ఇందుకోసం గురువు చెప్పిందే వేదం కానవసరం లేదన్నాడు..

వితండం కాని ఆయన తర్కం..
సజ్జనుల సంపర్కం..
ఆయన విచక్షణ.. అంతిమంగా అదే ఆచరణ

అదే రామానుజ ప్రతిపాదించిన మతస్వాతంత్రం..
భగవానుడే న్యాయనిర్ణేతగా దుర్నీతిపై తిరుగులేని రణతంత్రం..!
తాను నేర్చిన అష్టాక్షరినే బహిర్గతం చేసిన ధీశాలి…
తాను ఏమై పోయినా…
rama
పదిమంది స్వర్గానికి చేరుతారని నమ్మిన హృదయ వైశాలి…
తిరుపతి వెంకన్న స్వరూపాన్నే వాదనతో ఆవిష్కరించిన మేధావి…
వాదనల్లో ఎదుటి మనిషి మాటను సైతం మన్నించే మృదుస్వభావి…
ఎన్నెన్నో ఆలయాల్లో ఆగమ విధానాల రూపకర్త…
కలియుగంలో వెలసిన తొట్టతొలి సంస్కర్త…!
నవమార్గాల సృష్టికర్త… జగతి కొనియాడే యుగకర్త!!!

ఆధునిక జగతికి సరికొత్త ఆధ్యాత్మిక మార్గం చూపిన అంతటి రామానుజుని నిండైన విగ్రహం…
తెలుగు గడ్డపై ఆవిష్కారం
సహస్రాబ్ది వేడుకలై…
నెరవేరిన కలై…
ఒకనాటి ఈనాటి ఆధ్యాత్మిక సేతువు…
భక్తి సింధువు…
మహానారాయణ క్రతువు…
ఇది హిందుత్వానికి పట్టం….
ఆధ్యాత్మికతకు పట్టాభిషేకం…!
హైదరాబాద్ లో “”రామానుజ విగ్రహ ఆవిష్కరణ”” సందర్భంగా…సమతామూర్తికి ప్రణమిల్లుతూ

– నాగేష్ & రవీంద్ర

Leave a Reply