2014కి ముందు..

129

రోగం వచ్చిన ఏళ్ల తరబడి టీకా కోసం పరాయి దేశాల మీద ఆధారపడే దేశాన్ని మౌనంగా చూసిన మనమే..
coronavirus-live-india కరోన వచ్చిన ఏడాదిలో రెండు టీకాలు తయారుచేసి 40 కోట్ల డోసులు ఇచ్చిన దేశాన్ని గర్వంగా చూస్తున్నాం.

కాశ్మీరులో మువ్వన్నెల జెండా తగలబెడుతుంటే మౌనంగా చూసిన మనమే, ఇప్పుడు కశ్మీర్ నలుమూలలా మన జెండా ఎగురుతుంటే గర్వంగా చూస్తున్నాం.ఉగ్రవాదులు ఇంటి అల్లుళ్ళ మాదిరి దేశంలోకి వచ్చి, బాంబు దాడులు చేస్తూ మన వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే మౌనంగా చూసిన మనమే, కశ్మీర్ దాటి రాలేని ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వార్తలు గర్వంగా చూస్తున్నాం.

ఇక్ష్వా కోణం ఇహం భూమిః సశైల వనకాననా అన్న ఈ భూమిలో మన రాముడి గుడి కట్టుకోలేక మౌనంగా చూసిన మనమే భవ్య రామ మందిర నిర్మాణాన్ని గర్వంగా చూస్తున్నాం.మనకో చట్టం కాశ్మీరు ప్రజాలకో చట్టం అంటూ, 370 ఆర్టికల్ ద్వారా దేశాన్ని విడదీస్తే మౌనంగా చూసిన మనం, కశ్మీర్ దేశంలో అంతర్భాగం అక్కడ కూడా ఒకటే చట్టం ఒకటే జెండా అంటే గర్వంగా చూస్తున్నాం.

ఒకప్పుడు పాకిస్థాన్ మాట్లాడితే మన మీద ఉగ్రవాదుల్ని పంపి రెచ్చిపోతుంటే మౌనంగా చూసిన మనమే, మన సైనికులు సరిహద్దు దాటి మరి వాళ్ళని చంపుతుంటే గర్వంగా చూస్తున్నాం.ఒకప్పుడు రాత్రి పుస్తకం పట్టుకోగానే పవర్ కట్ అయ్యి గుడ్డి దీపాల్లో చదువులు సాగుతుంటే మౌనంగా చూసిన మనమే, ఇప్పుడు 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతుంటే ఇది నయా భారత్ అని గర్వంగా చూస్తున్నాం.

ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే డెలివరీ కోసం రోజుల తరబడి మౌనంగా వేచిచూసిన మనమే ఇప్పుడు, సెల్ ఫోన్లో బుక్ చేస్తే బుక్ చేసిన 24 గంటల్లో సిలిండర్ ఇంటికి రావడం గర్వంగా చూస్తున్నాం.
ఒకప్పుడు దూరంగా ఉన్న ఆత్మీయులతో మాట్లాడాలి అంటే సమయం లెక్కలు డేటా లెక్కలు చూసిన మనమే ఇప్పుడు, లెక్కలేని లెక్కకురాని సంభాషణలు చేస్తూ గర్వంగా చూస్తున్నాం.

ఒకప్పుడు ఎరువుల కోసం దుకాణం ముందు చెప్పులు పెట్టి పోయిన రైతన్నల బాధలు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు వద్దంటే వస్తున్న ఎరువుల సరఫరా గర్వంగా చూస్తున్నాం.ఒకప్పుడు చైనా అంటే అగ్రదేశం ఆ దేశం ముందు పనికిరాము అన్న పాలకుల మాటలు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు, ప్రధాని స్వయంగా సరిహద్దుల్లో నిలబడి ఖబడ్దార్ చైనా అనే హెచ్చరికలు గర్వంగా చూస్తున్నాం.ఒకప్పుడు సూది కూడా దిగుమతి చేసుకునే పరాయి ఆధార భారత దేశాన్ని మౌనంగా చూసిన మనమే ఇప్పుడు, ఆత్మనిర్బర్ భారత్ అంటూ మొబైల్ ఫోన్లు కూడా ఎగుమతి చేస్తున్న నయా భారత్ గర్వంగా చూస్తున్నాం.

modi-gunఒకప్పుడు సైనికులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా సరిహద్దుల్లో వాళ్ల ఇబ్బందులు మౌనంగా చూసిన మనమే ఇప్పుడు, బులెట్ ప్రూఫ్ జాకెట్టు అత్యాధునిక ఆయుధాలతో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్న సైనికులను గర్వంగా చూస్తున్నాం..ఒకప్పుడు తుపాకిలో బుల్లెట్ కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి మౌనంగా చూసిన మనమే ఇప్పుడు, మిత్ర దేశాలకి బ్రహోస్ క్షిపణి అమ్ముతుంటే గర్వంగా చూస్తున్నాం.

అత్యవసర మందులు నల్ల మార్కెట్లో అమ్ముతుంటే మౌనంగా చూసిన మనమే, ప్రపంచం విపట్టుకి దాసోహం అంటే మనం టెస్టులు చికిత్స ఉచితంగా ఇస్తుంటే గర్వంగా చూస్తున్నాం.
చిన్నపాటి కరువుకు ప్రజలు ఆకలి చావులు చస్తుంటే మౌనంగా చూసిన మనమే, గత పదమూడు నెలలుగా దేశ ప్రజలు అందరికీ ఉచితంగా రేషన్ ఇస్తున్న ప్రభుత్వాన్ని గర్వంగా చూస్తున్నాం.

ఇలా ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించిన నా దేశం ప్రపంచం ముందు గొప్పగా నిలబడే స్థితికి చేర్చిన ఈ ప్రభుత్వం చేతుల్లో, నేను నా పిల్లలు వారి భవిష్యత్తు భద్రం అని గర్వంగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేస్తున్నా.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు