మా పెద్దలు పోరాడి సాధించిన స్వాతంత్య్రం ఇలా చూస్తామనుకోలేదు

ఒక రోజు ముందు పాకిస్తాన్ ఒకరోజు తర్వాత హిందుస్థాన్ కి స్వాతంత్య్రం వచ్చిందని అటు జిన్నా ఇటు నెహ్రూ ప్రజలతో సంబరాలు జరుపుకుంటున్నారు. నిజంగా రెండు వైపులా ప్రజలు గర్వించ దగ్గ రోజు. కానీ ఎవరికి ఈ గర్వము ఎంతోకాలం నిలవలేదు. ఇండియా పార్టీయేషన్ అయినప్పుడు రెండుగా విభజించారు. ఒకటి పాకిస్తాన్ రెండవది హిందుస్థాన్ , హిందుస్థాన్ మాత్రం ఇండియా గానే మిగిలింది.

పార్టీయేషన్ లో ఇరు దేశాలవారు మతమౌఢ్యంతో లక్షల మంది ప్రయాణించలేక కొందరైతే, మరికొందరు కొట్టుకు చనిపోయారు, అక్కడ హిందువులు ఊచకోతకి గురి అయ్యారు. హింస చెలరేగింది. ఆస్తులు పోగొట్టుకున్నారు. చివరికి ఎవరు సంతోషించారు ఏమి సాధించారు అని ఉప్పొంగిపోయారు.

సరే స్వాతంత్య్రం వచ్చింది , వచ్చిన వెంటనే పాకిస్తాన్ , చైనా ఆక్రమణ. pok ఇప్పటికే మన అధీనం లో లేదు, చైనా 50 వేల sqk అక్రమించుకున్నారు. టిబెట్ తీసుకున్నారు. రంగును నుండి విదేశీయులను తరిమికొట్టారు. దోచుకున్నారు. హిందువులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని స్వదేశానికి వచ్చారు. ఇక్కడ కూడా కొన్ని వేలమంది ప్రాణాలు పోయాయి. ఆస్తి పోయింది. దేశం లో కొంత భూభాగం దురాక్రమణకు గురి అయింది.

పాకిస్తాన్ ఒక ముస్లిమ్ కంట్రీ గా అవతరించింది గానీ హిందూస్తాన్ మాత్రం సెక్యులర్ ఇండియా గా మారింది. జనసంఖ్య లో మైనారిటీలు పెరిగారు. హిందువులు తరిగారు. ఇక్కడకూడ న్యాయం జరగలేదు.
మత కల్లోలాలు పెచ్చుమీరాయి, ఎక్కడ చూసినా హింస, మత మార్పిడిలు పెరిగాయి. రాజకీయాల లో స్వచ్ఛత లేకుండా పోయి అవినీతి పెరిగింది. ప్రజలలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఒక వైపు దేశం లో టెర్రరిస్టులు పెరిగారు, నక్సలిజం పెరిగింది, బలమున్నవాడిదే రాజ్యాంగంగా మారింది. కుల పిచ్చి పెరిగింది, కులాల మధ్య చిచ్చు రగిలింది బాగుపడింది ఎవరు అంటే.. రాజకీయ నాయకులు, అవినీతి పరులు మాత్రమే.

ఇప్పటికి 70 శాతం ప్రజలు ఒక పూట తింటూ బ్రతుకుతున్నారు, ధనవంతులు అపర కుబేరులయ్యా రు. పేదవారు పెరిగారు 15 శాతం ఎటు కాకుండా వున్నారు. సమానత్వం లేదు. ఏమి సాధించామని?
ప్రభుత్వాల లో అవినీతి, నాయకులు అధికారం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తున్నారు. ఏమిసాధించామని?ప్రాజెక్ట్స్ కూలుతున్నాయి. భూకబ్జాలు పెరిగాయి. కోర్టులలో కేసులు పెరిగాయి, ముద్దాయిలు చనిపోయిన తరువాత కూడా కేసులు తేలనివిఎన్నో, ఏమి సాధించామని?దేశం లో హత్యలు, దోపిడీలు, మానభంగాలు పెరిగాయి, దోషులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వీరే నాయకులు అవుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా పేదవాడికి ఉండడానికి గూడు, కట్టుకోడానికి గుడ్డ, తినడానికి కూడు లేనివారు, ఇంకా ఈ దేశంలో ఆశించేవారు వున్నారు అంటే మనం ఏమి సాధించాం?135 కోట్ల జనాభాలో ఒలింపిక్ మెడల్ సాధించడంలో కూడా అతి కష్టంగా మారింది.

దేశంలో సంవత్సరానికి లక్షలలో ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్, తయారవుతున్నారు. 4400 డాక్టర్స్ ని తయారు చేస్తున్నారు. వీరికి సరి అయిన ఉద్యోగ వసతిలు లేక కొందరు విదేశాలకు వలస వెళ్తుంటే, కొందరు ప్రయివేటు జాబ్స్, ఔట్ సౌర్చింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమి సాధించాం?రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం పెరిగింది, వైద్యం ఖరీదైంది. ఆకలి పెరిగింది. సమాజం లో తారతమ్యాలు పెరిగాయి. మతాలుగా చీలిపోయి.. అధికారులు, ధనవంతులు , పేదవారు వర్గాలుగా విడిపోయారు.

ఎన్నో త్యాగాలు చేసి , ప్రాణాలు ఒడ్డిన తరువాత స్వతంత్రం వచ్చింది. వచ్చి 75 ఏళ్ళు గడిచినా నిజమైన స్వాతంత్రం ఎవరికి వచ్చింది, ఎవరు అనుభవిస్తున్నారు?దేశం శత్రువుల నుంచి కాపాడుకోవడానికే 75 ఏళ్ళు సరిపోవడంలేదు. మరి ఎలా ?మీకే వదలివేస్తున్నాను.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు
9666606695