Suryaa.co.in

Features

గౌతమ బుద్దుడు చెప్పిన “అంగుత్తరనికాయ”

-ప్రతి మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు
1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులు , సంపద, ఆస్థి అన్నీ ఏదో ఒక రోజున మార్పుకు, నాశనానికి, లేదా ఎడబాటుకు లోనయ్యేవే. దాన్ని నేను తప్పించుకోలేను.
5. నేను చేసిన పనుల [ స్వకర్మల ] ఫలితంవల్లే నేను ఇలా తయారయ్యను. నా పనులు ఎటువంటివైనా, మంచివైనా చెడువైనా – వాటికి నేను వారసుణ్ణి కావలసిందే.
అనారోగ్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్నీ, వృద్ధాప్యాన్ని గుర్తుంచుకోవటం ద్వారా యవ్వనం వలన కలిగే అహంకారాన్ని, మృత్యువును ధ్యానించటం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్ని, ప్రతి వస్తువులో కలిగే మార్పునీ, నాశనాన్ని ధ్యానించటంద్వారా, అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణిచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు .మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని మననం చేసుకోవటం ద్వారా ఆలోచనలలో, మాటలలో, పనులలో చెడు చేయాలనే దుర్మార్గ స్వభావం అణగారుతుంది. కనీసం తగ్గుతుంది.

LEAVE A RESPONSE