Suryaa.co.in

Food & Health

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎందుకు కుప్పకూలిపోతారు

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే!
ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన వాటిలో ఉన్నాయి..
1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం..
2.HCM హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి
3.అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ
4.MVP మైట్రల్ వాల్వు ప్రొలాప్సు
5.అరిథమిక్ ధోరణి
6.Qtc పొడిగించే డ్రగ్స్ వినియోగం
7.సొంతవైద్యంతో వాడే మందులు మరియు సప్లిమెంట్లు
8. తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ బాధ్యత వహిస్తుంది.
చాలా మరణాలు అరిథమిక్ VF వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ VT వెంట్రికులార్ టాకీకార్డియా వలన వస్తాయి., కాకపోతే కొన్ని ACS అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్సు అనగా గుండె రక్తనాళాలలో కొవ్వు చేరుకోవడం వల్ల వచ్చే కొరోనరీ స్పాజమ్ కావచ్చు.. కొందరిలో ఆంజైనా నొప్పి వచ్చి పరీక్షలుకు సమయం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు….
ఎక్కువ వ్యాయామం,జిమ్ ప్రోగ్రామ్‌కు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే ముందు సరైన కార్డియాక్ చెకప్ పొందడం వివేకంతో కూడిన చర్య. ఈ పరీక్షలు మీకు రిస్కు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వారు చేసుకోవచ్చు..
1. ECG
2. ECHO CARDIOGRAM (ఎకో)
3. Treadmill Test or Stress Test అధిక ప్రమాదం ఉన్న వారిని పరీక్షించడానికి గుర్తించడానికి సరిపోతుంది.
Syncopal Attacks అంటే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు (మూర్ఛ), Syncope యొక్క చరిత్ర కలిగిన అభ్యర్థులు, ఆకస్మిక మరణం అనేది కుటుంబ చరిత్ర గల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

LEAVE A RESPONSE