పానీపూరీ వల్ల టైఫాయిడ్ పాజిటివ్ కేసులు..!

– పానీ పూరీ అమ్మేవాళ్ళ చేతి వాడకం వల్ల టైఫాయిడ్ విజృంభణ

బెజవాడ:పానీ పూరీ అంటే ఇష్టపడని జనాలు ఉంటారా చెప్పండి. ఎంత పెద్ద డబ్బున్న వ్యక్తి అయిన సరే..రోడ్డు పక్కన కార్ ఆపి మరీ పానీ పూరీ తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం గా తినే ఈ పానీ పూరీ ఇప్పుడు కొత్త సమస్యలను తీసుకువస్తుంది. గత కొద్ది రోజుల నుండి విజయవాడలో జ్వరాలు, జలుబు, దగ్గు అంటూ హాస్పిటల్ కి క్యూ కడుతున్న వారీ సంఖ్య ఎక్కువగా ఉంది.

చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఇలాంటి లక్షణాలతో హాస్పిటిల్ కి వెళ్తున్నారు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా జ్వరం తగ్గట్లేదని..నీరసం గా ఉంటుందని..రోగులు చెప్పుకొస్తున్నారట. టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని తేలింది. కాగా, రోజు రోజుకు ఇలాంటి రోగుల సంఖ్య ఎక్కువ అయిపోతున్నారు. ఈ క్రమంలో నే ఎక్కువుగా RMP వైద్యుల దగ్గర టైఫాయిడ్ కేసులు అధికమయ్యాయి.ముక్యంగా ఏలూరు రోడ్డులో, బందరు రోడ్డు, మొగల్రాజపురంలో కేసులు అధికంగా ఉన్నాయని RMP వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీరు ఉంటే కచ్చితంగా టైఫాయిడ్ భారిన పడతారని పానీపూరీ అమ్మేవాళ్ళు అదే చేతిని ముంచటం వల్ల బ్యాక్టీరియా విజృంభిస్తుందని వెల్లడిస్తున్నారు.

ఇలా “టైఫాయిడ్” కి గురైన వారిలో ఎక్కువుగా పానీ పూరీ తినే వారు ఉన్నారని, జ్వరం అంటూ బాధపడే వాళ్లల్లో ఎక్కువ మంది పానీ పూరీ తిన్నాకనే ఇలా సిక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు నగరవాసులు పానీ పూరీ అంటేనే భయపడుతున్నారు. బయట పడుతున్న వర్షానికి..దోమలు ఎక్కువ అవ్వడం..వాతావరణంలో మార్పులు..అంటూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే..ఇప్పుడు కొత్తగా ఈ టైఫాయిడ్ నగరవాసులను మరింత భయపెడుతుంది.

తెలంగాణాలోనూ టైఫాయిడ్ కేసులు..

తెలంగాణ ప్రజలను టైఫాయిడ్ మహమ్మారి వణికిస్తోంది. ఈ జులైలోనే రాష్ట్రవ్యాప్తంగా 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలామంది ఆస్పత్రులకు రాకుండా సొంత వైద్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికంతటికీ పరిశుభ్రత లేని ఆహారం, రోడ్డు సైడ్ ఫుడ్ తినడమే అంటున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు.

నగరంలో టైఫాయిడ్ కేసులు పెరగడానికి కోల్డ్ ఫుడ్స్, ఫిల్టర్ చేయని నీరు కార‌ణ‌మ‌ని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మాట్లాడుతూ.. నగరంలో టైఫాయిడ్ కేసులు పెరగడానికి పానీపూరీ కారణమని అన్నారు. అయితే ఇది పాక్షిక కారణం మాత్ర‌మే అని వైద్యులు చెబుతున్నారు. నీరు, ఆహారం కలుషితం కావడం, సరిగ్గా వేడి చేయని ఆహారాల వల్ల టైఫాయిడ్ వస్తుంది అని వారు అంటున్నారు.

ప్రెస్ మీట్ లో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యంగా టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే.. దీన్ని పానీపూరీ వ్యాధి అని కూడా అనవచ్చు.. రుచి కోసం తింటారు కానీ ఎంత హానికరమో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సీజన్‌లో విక్రయదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. “వారు నీటిని ఉపయోగించే ముందు నీటిని మరిగించాలి. పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం దగ్గర దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి,” అన్నారాయన.

ఈ విష‌య‌మై కేర్ హాస్పిటల్స్‌ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ వివరిస్తూ.. “పానీ పూరీలో నీటి మిశ్రమాలు ఉన్నాయి. ఉపయోగిస్తున్న‌ నీటి మూలాలు తెలియదు కాబట్టి అవి కలుషితమవుతాయని అంటున్నారు. అదేవిధంగా చల్లగా ఉండే ఆహార పదార్థాలు కూడా కలుషితానికి కారణమని అనుమానిస్తున్నారు.

డాక్టర్ జె సతీష్, జనరల్ ఫిజిషియన్ వివరిస్తూ, “చేతులు, ఇంటి ఈగల ద్వారా కలుషితం అవుతుంది. ఈ రెండు ఏజెంట్లు వ్యాధుల ఆవిర్భావానికి సాధనాల‌ని అన్నారు.

Leave a Reply