-పాడేరులో గుట్టుచప్పుడు కాకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ఏర్పాట్లు
-32 గ్రామాల్లోని గిరిజనుల్ని రోడ్డున పడేసేలా ప్రభుత్వ నిర్ణయం
-గిడ్డి ఈశ్వరి
ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టాలిచ్చి కాఫీ, మిరియాల తోటలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తే, జగన్ రెడ్డి జేబులు నింపుకోడానికి ఆ భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. పాడేరు నియోజకవర్గంలో బాక్సైట్, లేటరైట్, గ్రానైట్ అక్రమ తవ్వకాలు తీవ్రంగా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రాగా, కొయ్యూరు మండలంలోని 32 గ్రామాల్లో సర్వే చేశారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ROFR పట్టాలిచ్చిన ప్రాంతంలో కాఫీ, మిరియాల తోటలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ 32 గ్రామాలను హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్ ను కలిసినప్పటికీ వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో టీడీపీ హయాంలో రోడ్లు వేసేందుకు కూడా అనుమతివ్వని అటవీ శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుకు గ్రామ ప్రజల తీర్మానం అవసరం లేకుండా అనుమతులిచ్చేశారు. టీడీపీ హయాంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపి గిరిజనులకు అండగా నిలిస్తే.. జగన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం గిరిజనుల్ని రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాల్సిందిగా చంద్రబాబు నాయుడును విన్నవించారు.