కూడు లేని బ్రతుకు..
గూడు లేని నిద్ర..
కాని..నేర్చే అక్షరమే
వీడిపోని ముద్ర..!
ఆకలి దాచుకుని అమ్మ
సుఖం మరచి అయ్య…
నీ కోసం చేస్తుంటే త్యాగం..
అందుకోవమ్మా
అక్షరాల సరాగం..!
ఆడపిల్ల ఆడ పిల్లే అనుకోక
నిన్ను పెంచినందుకు ప్రతిఫలం ఆశించక
నీ కోసమే ఈ చదువు,.
పెరిగాక నీ
బ్రతుకు తెరువులో
అమ్మానాన్నల కోసం
నీ తలుపు తెరువు..!
రాబడి చాలని నాన్న
తన కష్టమే పెట్టుబడిగా
పంపిస్తుంటే బడికి
నీ చదువు
కారాదు మొక్కుబడి..!
నువ్వెక్కే ఒక్కో మెట్టు
అమ్మానాన్నలను దాటించు
కష్టాల గట్టు..
ఎదిగి నువ్వు
వారి త్యాగాలను
మరచిపోకు సుమీ
నీ చదువు మీదొట్టు..!
-ఇ.సురేష్ కుమార్
9948546286