ఎపీఎన్జీఓల సంఘ వేడుకోలు
కామెడీ వీడియో వైరల్
ఆంధ్రాలో సర్కారు ఉద్యోగుల గోస అట్లిట్ల లేదు. ఆరో తేదీ వచ్చింది. జీతాలేవీ సారూ అని హెడ్స్ దగ్గర ఉద్యోగులు రోజుకు పదిసార్లు అడుగుతున్నారట. దీనితో ధైర్యం చేసిన ఉద్యోగ సంఘ నేతలు సీఎస్ దగ్గరకు వెళ్లి, ఆరోతేదీ వచ్చింది. జీతాలింకా పడలేదు సార్ అత్యంత దీనంగా వేడుకున్నారట. పాపం.. ఆయన మాత్రం ఏం చేస్తారు? ఓకే చూస్తా అని ఓ హామీ ఇచ్చారట. పాపం ఆంధ్రా ఎంప్లాయిస్!
ఫిబ్రవరి నెలలో 6 తేదీ వచ్చినా జనవరి జీతాలు చెల్లించక పోవటంపై వెలగపూడి సచివాలయ సెక్షన్ అధికారుల సంఘం ఆర్ధిక శాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతి నెల మొదటి తేదీన జీతాలు విడుదల కాకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ కె.ఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ఎన్జీవోల సంఘం విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 6 తేదీ వచ్చినా జనవరి జీతాలు చెల్లించకపోవటంపై సచివాలయంలోని సెక్షన్ అధికారుల సంఘం ఆర్ధిక శాఖ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చింది.
సచివాలయంలోని ఆర్ధిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ, అసెంబ్లీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన ప్రభుత్వం .. మిగిలిన శాఖల ఉద్యోగులకూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆర్ధిక శాఖ అధికారులకు సెక్షన్ ఆఫీసర్ల సంఘం వినతిపత్రాన్ని ఇచ్చింది.మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు త్వరితగతిన చెల్లించాలని డిమాంవేతనాలను సకాలంలో చెల్లింకపోతే ఏప్రిల్ నుంచి ఆందోళన తప్పదని కూడా సంఘా హెచ్చరిస్తున్నాయి.
దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక కోతి ఓ వ్యక్తి చెవిలో జీతాలు ఎప్పుడిస్తారు? అని అడిగితే, అత ను కూడా వచ్చే నెల ఇస్తారట అని చెవిలో చెప్పే వీడియో ఒకటి నవ్వులు కురిపిస్తోంది.