ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జీవో 317 తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.