Suryaa.co.in

Political News

పదండి ముందుకు..

కుక్కపిల్ల
అగ్గిపుల్ల
సబ్బు బిళ్ళ
కావేవీ కవిత కనర్హం
అది శ్రీశ్రీ గారి తరం .!

కోడి కత్తి గాటు..
గండ్ర గొడ్డలి వేటు..
కన్న తల్లి చేటు..
సొంత చెల్లి గిరాటు..
గులక రాయి గీటు..
కావేవీ జగన్ కనర్హం ..!

మాట తప్పం, మడమ తిప్పం! జగన్ నినాదం ..!
అభివృద్ధి అడవి
పాలన అప్పుల కడలి
జగ మెరిగిన సత్యం .!

మద్యపాన నిషేధం మామ హామీ!
భూం భూం ఢాంఢాం తో జనమంతా హరీ .!!

ఇంటికో ఉద్యోగం యువతకు చేయూత జగన్ మాట .!
వీధికో గంజాయి వనం అన్నేసిన బాట .!

పోలవరం పర్సెంటా అర పర్సెంటా అపోహలొద్దన్న అ నిల్ నోటిపారుదలే కానీ, అణుమాత్రం కదలని నీటిపారుదల

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇసుకదందాలను అరికడతా .!
అధికార పక్షంలో దందాలతోనే మొదలిడిన నీ పాలన !!

మెజారిటీ లోక్సభ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా చిటికెతో తెస్తానని సవాల్!!
ఈ ఐదేళ్లుగా ఢిల్లీలో నీ సాష్టాంగ ప్రమాణాలన్నీ ఢమాల్!!

నాడు అమరావతే రాజధానని ప్రకటించావ్ .!
నేడు అవిఛ్చిన్నం చేసి రైతుల పట్లవికృత హాసం చేస్తున్నావ్? ?

నాడు షిన్నన్న హత్యకి సీబీఐ కావాలని మారాం చేసావ్ !
నేడు షెల్లి సీబీఐ విచారణంటే అంతలా
ఘోషిస్తున్నావ్??

మాటతప్పం మడమతిప్పం
సింహం సింగల్
అన్నావ్ కదా !
మరి మద్యనిషేధం, పోలవరం, నియామకాలు
పాతాళంలో తొక్కి పరదామాటున పయనం ఏందన్న?

అమరావతి అంతా గ్రాఫిక్స్ ,
కమ్మరావతని నమ్మించావ్.. !
రైతుల దీక్ష…వారి ఉసురు తగలకపోవునా నీ అధికార మదానికి అగ్నిపరీక్ష.?

మూడు రాజధానులని న్నావ్ ..! ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ బ్రాండ్ బార్లలో కళకళ లాడిస్తున్నావ్!

నాకే పత్రికలు లేవు మీడియా లేవంటివి.!
మరి సాక్షి పత్రిక మీడియా ఎవడబ్బసొమ్మని నారసురవధ అంటవి?

నీ దృష్టిలో
విశ్వసనీయతా అంటే
ఇదేనా జగన్??

షిన్నాయన్ని చంపి
సాక్షిలో గుండెపోటని
తర్వాత ఎవరో సంపితిరని
ఆపైన షిన్నాయన రెండో భార్య పై నింద మోపి,ఇంకా దిక్కుతోచక సొంతోళ్ళే అంతం చేశారని మాట మార్చిన ఊసరవెల్లివి!!

మరి వీటిలో నీ విశ్వసనీయత …..
మానవతా విలువలెక్కడ ఉన్నాయో వెతికి చెప్పన్నా..?

ఇలా చెప్తూపోతే తరగని నీ హీనచరిత్ర అక్షరరూపం కనుక దాలిస్తే ఏ గ్రంధాలయాలు కూడ సరిపోవు!!

గతించేకాలం ఎంతో దూరంలో లేదు, చెప్పుకోటానికి ఏముంది మీకు గర్వ కారణం.?

నీ గతం
ఒక చీకటి మయం..
నీ పాలన అంతా
కామాంధులు
మదాంధుల పరం.
అస్తవ్యస్తం..
అధికార దుర్వినియోగం..
అభివృద్ధి తిరోగమనం..!

ప్రశ్నించే గొంతుకని పెరికివేయటం..
హక్కులని కాలరాసే సంకెళ్లు ..
దళిత మరణాల డోర్ డెలివరీలూ…

పదండి ముందుకు
ప్రతి గళం యువగళమై ..
ఎండని, వానని, వాగని పొద్దని లెక్కించక
పిడికిలి తెరచి
చూపుడువేలుని
ఎక్కుపెట్టి …
గురిపెట్టి మరీ సంధించండి!

బాధిత పీడిత బంధువులారా పదండి ముందుకు..
పదండి తోసుకు…
నిశీధి పాలనపైకి

అంతం చేద్దాం…ఆహుతి
చేద్దాం..ఉన్మాదుల దాష్టికాలకు చరమ గీతం పాడుదాం

– డాక్టర్ శృతి

LEAVE A RESPONSE