-గోవా టూ నెల్లూరు వయా తాడేపల్లి ప్యాలెస్ మద్యం మాఫియా డాన్ జగన్ రెడ్డే
-కల్తీ మద్యం అమ్మకాలతో ఏటా రూ.6వేల కోట్లవరకు దోచుకుంటున్న జగన్ రెడ్డి, తాను తీసుకొచ్చిన మద్యం పాలసీపై న్యాయవిచారణకు ఆదేశించాలి
• ప్రజలు ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు గానీ, తనఏలుబడిలో రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న కల్తీమద్యం, నాటుసారాలను నిరోధించి, ప్రజలప్రాణాలు కాపాడాలన్న ఆలోచనచేయడంలేదు
• ముఖ్యమంత్రి నిన్న నెల్లూరు పర్యటనలో ఉన్నప్పుడే అక్కడ 17,800ల సీసాలకు పైగా గోవామద్యం పట్టుబడింది
– టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి
జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రం జేబ్రాండ్ మద్యం..నాటుసారా.. గంజాయి..ఇతర మాదకద్రవ్యాలకు పుట్టినిల్లుగా మారిందని, వైసీపీనేతలు, కార్యకర్తలుసాయంతో ధనార్జనే ధ్యేయంగా జగన్ రెడ్డి తనకల్తీమద్యం, నాటుసారా అమ్మకాలను సాగిస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు.బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో నే క్లుప్తంగా మీకోసం…!
కొత్తమద్యంపాలసీతో గతంలో ప్రైవేట్ వ్యక్తులఅధీనంలోఉన్న మద్యందుకాణాలను జగన్మోహన్ రెడ్డి మొత్తం తనఅధీనంలోకి తెచ్చుకున్నాడు. దుకాణాలన్నీ తనపరం కాగానే తనకు చెందిన మద్యంతయారీకంపెనీలతో జేబ్రాండ్స్ మద్యాన్ని అధికధరలకు అమ్మిస్తు న్నాడు. ఈ విధంగా ముఖ్యమంత్రి సాగిస్తున్న అక్రమమద్యం వ్యాపారంతో ఏటా రూ.6వేలకోట్ల వరకు ఆయన ఖజానాకు చేరుతోంది. నాసిరకం మద్యాన్ని ప్రభుత్వమే అధికధరలకు అమ్ముతుండటంటో చాలా చోట్ల నాటుసారా, ఇతరమాదకద్రవ్యాలవాడకం పెరిగిపోయింది. దానికితోడు గోవా, ఇతరరాష్ట్రాలకు చెందిన కల్తీమద్యం సరిహద్దులుదాటి రాష్ట్రంలోకి డంప్ అవుతోంది. ముఖ్యమంత్రి నిన్ననెల్లూ రుజిల్లాలో ఉన్నప్పుడే 17,800 సీసాలకు పైగా గోవామద్యం పట్టుబడింది. ఆసీసాలపై ఏపీ లేబుళ్లు అతికించి ఉన్నాయి.
ఇతరరాష్ట్రాలనుంచి ఇంతయథేచ్ఛగా నాసిరకం మద్యం రాష్ట్రం లోకి వస్తున్నా, ఎక్సైజ్, ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో) అధికారులు ఏంచేస్తు న్నారని ప్రశ్నిస్తున్నాం. ఇతరరాష్ట్రాలనుంచి నాసిరకంమద్యాన్ని తీసుకొచ్చి, దాన్నిమరింత కల్తీచేసి, ప్రజలకు అంటగడుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఏంచేయాలో ప్రజలేనిర్ణయించుకోవాలి. ఎస్ఈబీ విభాగంలోఉన్న 2,156మంది ఎస్పీవోస్థాయి అధికారులు జీతాలుపెంచాలని అడిగారని ఈప్రభుత్వం వారినితొలగించింది. ఇతరరాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకిరాకుండా చూసేది సదరుఅధికారులే… వారినేతీసేయాలని ఈ ప్రభుత్వం చూస్తుం దంటే, పొరుగురాష్ట్రాల్లోని నాసిరకంమద్యం ఏపీలోకి రావడానికి తలుపులు తెరుస్తుందనే అనుకోవాలి.
గోవామద్యం నెల్లూరుకి, అక్కడినుంచి ఇతరప్రాంతాలకు వస్తోందంటే అది సాదాసీదావ్యక్తులవల్ల అయ్యేపనికాదు. ఆయారాష్ట్రాల్లో మూడోరకం మద్యంగా పిలువబడే నాసిరకం మద్యాన్నేఏపీలోకి తీసుకొచ్చి, దాన్నికల్తీచేసి అమ్ముతున్నారు. ఈ వ్యవహారం వెనకాల పెద్ద రాకెట్టే నడుస్తోందని తమ అనుమానం. ముఖ్యమంత్రికి, వైసీపీవారికి ప్రజల ఆరోగ్యంకంటే, వారివ్యక్తిగత ఆదాయంపైనే శ్రద్ధఎక్కువగా ఉంది. ఏపీలోని అన్నిదుకాణాల్లో పొరుగురాష్ట్రాల మద్యం అమ్మకాలుసాగుతున్నాయి. ముఖ్యమంత్రి, వైసీపీనేతలు, మంత్రుల ఆదేశాలులెక్కచేయకుండా అధికారులు రాష్ట్రంలోని మద్యందుకాణాలపై దాడులుచేస్తే భారీ మొత్తంలో ఇతరరాష్ట్రాలకుచెందినకల్తీమద్యం పట్టుబడుతుంది. తాను తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఎటువంటి లొసుగులు, లోపాలు లేవని ముఖ్యమంత్రి భావిస్తే, తక్షణమే దానిపై ఆయన న్యాయవిచారణజరిపించి, అసలువాస్తవాలు ప్రజలముందుఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డ్డి గూడెం నాటుసారా మరణాలను సహజమరణాలనిచెప్పి తప్పించుకు న్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలో తానుఅమలుచేస్తున్న మద్యంపాలసీలోని అసలువాస్తవాలను బయటపెట్టాలి.