పేద ప్రజలకు ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డలను అందించి వారికి అండగా నిలిచిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను వర్తింపజేస్తూ పువ్వాడ పెళ్లి కానుక పేరిట నూతన పెళ్లి దంపతులకు అండగా నిలుస్తున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం కొత్తమామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన వికలాంగుడు వెంకటయ్య కుమార్తె వివాహానికి బీరువాను కానుకగా పువ్వాడ యువజన సంఘం బాధ్యుడు మోటురి మోహన్ అందజేశారు.
కడ కాలంలో కనికరించేవారు లేక కష్టపడ్డ వృద్ధులను, అర్ధాకలితో పస్తులున్న పేదలను, వితంతువులను అనేక వర్గాల ఆర్తులను ఆప్యాయతతో ఆదుకున్న చరిత్ర పువ్వాడ కుటుంబంది ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. నాడు పువ్వాడ నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్ నుంచి నేటి అజయ్ కుమార్ వరకు పేదల పక్షాన నిలిచే గుణం వారిది. నాడు అధికారం లేకున్న పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన సందర్బాలు ఎన్నో.. నేడు అధికారపక్షంలో ఉన్న మంత్రి అజయ్ కుమార్ సరికొత్త ఒరవడి తో పేదల బతుకు చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేపట్టి సఫిలికృతమయ్యారు.
ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రజాపాలన ఎలా ఉంటుందో, ప్రభుత్వ పథకాలు పేదలకు ఎలా అందుతాయో చూస్తున్నాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం మంత్రి అజయ్ కి ఇంట్లో కూర్చుంటే రాలేదు. పదేళ్లు ప్రజల్లో ఉన్నారు. పొలం గట్టెక్కారు పూరి గుడిసెలో బువ్వ తిన్నారు. కాల్వ గట్లు మీద పేదల గోడు పాఠాలు చదివారు. ప్రజల కష్టాలను పుస్తకాల్లో కాకుండా కళ్లతో కళ్లారా చూశారు. చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు చేయి పట్టుకుని, చేతిలో చేయివేసి జీవితాలకు భరోసా ఇచ్చారు. ప్రజలంటే ఆయనకు ప్రాణం వారికి సేవ చేయడానికే పుట్టినట్లు ఆలోచిస్తారు.
ప్రజలను నమ్ముకుని అడుగులు వేశారు. ప్రజలను అమ్ముకునే వాళ్లతో పోరాటం చేశారు.తనకు ప్రజలకిచ్చిన మాట కంటే ఏదీ ఎక్కువ కాదని దేశం మొత్తం వినబడేలా నినదించారు. ఒక చిరునవ్వుతో శత్రువులను చిందవందర చేశారు. చెదరని చిరునవ్వే ఆయుధం పోరాడే గుణమే ఆయన బలం. మాట తప్పని నైజం పేదల పక్షపాతి జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఆశయాలే వారసత్వం ప్రజల ముఖాల్లో ఎల్లప్పుడూ సంతోషం కనిపించాలనే తపనతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలు మెచ్చిన సంక్షేమ పాలన అందిస్తున్నారు.