-కూటమి పాలనలో కష్టాలుండవు
-వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు: ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలకు ఇక కష్టాలు ఉండవని మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్, పంచాయితీరాజ్ చాంబర్స్ సంఘం అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దుష్టపాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. ఆంధ్ర-తెలంగాణకు చెందిన సర్పంచ్, పంచాయితీరాజ్ చాంబర్ సంఘాల సభ్యులు రాజేంద్రప్రసాద్‌ను ఉయ్యూరులోని ఆయన ఆఫీసులో కలసి సన్మానించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…. ఆంధ్ర రాష్ట్రంలో దుష్ట పరిపాలన పోయి ప్రజా పరిపాలన వచ్చిందని, చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే ఆలోచనలో ఉన్నారని, దానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుగా నిలవాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు వంపుగడవల ఫ్రాన్సిస్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు( అరకు), బొర్ర విజయ మనోహరి , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ (పాడేరు)ర్రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ (ప్రకాశం జిల్లా), సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లు కొండయ్య (కడప జిల్లా)ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షులు వీరభద్రాచారి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి, ( తెలంగాణ నుండి వచ్చిన చేవెళ్ల బీసీ